హెల్త్ ఇన్సురెన్స్‌లో చేంజెస్..!

ఆరోగ్యం జాతీయం టెక్నాలజీ తెలంగాణ మహబూబ్ నగర్ రాజకీయం లైఫ్-స్టైల్ వికారాబాద్ హైదరాబాద్

హెల్త్ ఇన్సురెన్స్‌లో చేంజెస్..!
– అమలులో ఐఆర్‌డీఏ కీలక మార్పులు
– ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే
దర్శిని డెస్క్ : ప్రస్తుత జీవన శైలిలో ఎవ్వరికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఏ రోగం వస్తుందో.. ఏ వ్యాధి ముంచెత్తుతుందో అని భయాందోళన పడుతుంటారు. ఆరోగ్యానికి భయం లేకుకండా పలువురు బీమా చేసుకుంటుంటారు. అయితే ఆరోగ్య బీమా(హెల్త్ ఇన్సురెన్స్)లో ఐఆర్‌డీఏ కీలక మార్పులను తీసుకవచ్చింది. ఈ మార్పులతో పాలసీ దారులకు దీమా ఏర్పడింది. ఆ మార్పులు ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

సీనియర్‌ సిటిజన్లు, విద్యార్థులు, పిల్లలు, గర్భిణులతో సహా, కాంపిటెంట్‌ అథారిటీ పేర్కొన్న అన్ని వయస్సుల వారందరూ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2024 ఏప్రిల్​1 నుంచే ఈ మార్పు అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ఇంతకు ముందు కొత్త ఆరోగ్య బీమా పాలసీ కొనుగోలు చేయాలంటే గరిష్ఠ వయో పరిమితి 65ఏళ్లుగా ఉండేది. ఇకపై వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా ఆరోగ్య బీమా పాలసీ కొనుగోలు చేయవచ్చు.

పాలసీని తీసుకునే టైంలో పాలసీ తీసుకుంటున్న వ్యక్తి ఆరోగ్య పరిస్థితి వివరాలను తొలుత తెలుసుకుంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ప్రారంభం కావడానికి కొంతకాలం వెయింటింగ్‌ పీరియడ్‌ ఉంటుంది. ఒకవేళ బీమా తీసుకున్న వ్యక్తి ఈ గడువులో ఆస్పత్రి పాలైతే ఎలాంటి కవరేజీ లభించదు. దీన్నే పీఈడీ వెయిటింగ్‌ పీరియడ్‌ అని పిలుస్తుంటారు. ఇంతకుముందు నాలుగేళ్లుగా ఉన్న ఈ వెయిటింగ్‌ పీరియడ్‌ ను ఇప్పుడు 3 సంవత్సరాలకు ఐఆర్‌డీఏఐ తగ్గించింది.

వెయిటింగ్ పిరీయడ్ తగ్గింపు
ఇంతకుముందు వరకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ మారటోరియం వ్యవధి 8 సంవత్సరాలుగా ఉండేది. ఇప్పుడు దాన్ని 5 ఏళ్లకు తగ్గించారు. అంటే పాలసీని తీసుకున్న తర్వాత 5 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లిస్తే, ఒప్పందం ప్రకారం అన్ని క్లెయిమ్‌లను బీమా సంస్థ చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నప్పుడు కొన్ని వ్యాధులకు చికిత్సలపై నిర్దిష్ట కాలం పాటు వెయిటింగ్ పీరియడ్ వ్యవధి 4 సంవత్సరాలుగా ఉంది. దీన్ని తాజాగా ఐఆర్‌డీఏఐ మూడేళ్లకు(36 నెలలకు) తగ్గించింది. ఈ వ్యవధి ముగిసిన తర్వాత పాలసీలో పేర్కొన్న చికిత్సలపై పాలసీదారుడు కవరేజీని పొందొచ్చు. తాజా మార్పులు ఇప్పటికే పాలసీ తీసుకున్న వారికి కూడా వర్తించనున్నాయి.

ఇదికూడా చదవండి…

హామి లేకుండా రూ. 1 కోటి లోన్..!