హామి లేకుండా రూ. 1 కోటి లోన్..!
– సొంత వ్యాపారానికి బెస్ట్ స్కీం
– ఎవరు అర్హులు ఎవరంటే..?
దర్శిని డెస్క్ : సొంత వ్యాపారానికి ప్రారంభించాలనుకునే వారికి రూ. 10లక్షల నుంచి రూ. 1కోటి వరకు రుణాలు పొందవచ్చు. అదికూడా ఎలాంటి హామి లేకుండా తీసుకోవచ్చు. కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకునే వారికి చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు(ఎస్సీ, ఎస్టీ) చెందినవారితో పాటు మహిళలకు కూడా రుణాలు మంజూరు చేస్తోంది. ఆ పథకం పేరు స్టాండ్‌అప్ ఇండియా స్కీమ్. ఏడు సంవత్సరాల క్రితం దీన్ని ప్రారంభించారు.
ఈ పథకంద్వారా రుణాలు పొందుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ స్కీమ్ ద్వారా రుణాలు పొందుతున్నవారి సంఖ్య ప్రతీ నెలా పెరుగుతోంది. మరి మీరు కూడా ఈ స్కీమ్ ద్వారా ఎలా ప్రయోజనం పొందాలో తెలుసుకోండి. స్టాండ్‌అప్ ఇండియా స్కీమ్ ద్వారా రుణం తీసుకోవాలంటే కనీస వయస్సు 18 ఏళ్లు దాటాలి. పార్ట్‌నర్‌షిప్ ద్వారా వ్యాపారం చేస్తున్నట్టైతే ఆ వ్యాపారంలో ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాలవారు, మహిళలకు కనీసం 51 శాతం వాటా ఉండాలి. గతంలో బ్యాంకులో రుణాలు తీసుకొని డిఫాల్ట్ అయినట్టు చరిత్ర ఉండకూడదు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
స్టాండప్ ఇండియా స్కీమ్ ద్వారా రుణం పొందడానికి మూడు మార్గాలు ఉన్నాయి. నేరుగా బ్యాంకుకు వెళ్లి ఈ లోన్ అప్లై చేసుకోవచ్చు. లేదంటే స్టాండప్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అలాగే లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ ద్వారా కూడా లోన్ పొందవచ్చు. ఈ https://www.standupmitra.in/LDMS లింక్ ద్వారా డిస్ట్రిక్ మేనేజర్ వివరాలు పొందొచ్చు. https://www.standupmitra.in/Login/Register లింక్ ద్వారా నేరుగా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చుస్టాండ్‌అప్ ఇండియా స్కీమ్ ద్వారా లోన్ కావాలనుకునేవారు https://www.standupmitra.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.

స్కీం ఎప్పటి వరకు అంటే…?
కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రారంభించిన ఈ పథకం 2025 వరకు అందుబాటులో ఉంటుంది. అంటే ఈ స్కీమ్ ద్వారా మరో రెండేళ్లు రుణాలు పొందొచ్చు. అప్పట్లోగా మరో రూ.20,000 కోట్ల రుణాలు మంజూరు చేసే అవకాశం ఉంది. ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసినవారు రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు రుణాలు పొందొచ్చు.
ఇదికూడా చదవండి….

