రెక్క‌లు క‌ట్టుకున్న బాలుడు

జాతీయం

ఎగ‌రాల‌నే.. ఆశ‌తో..!
– రెక్క‌లు క‌ట్టుకున్న బాలుడు
– చిట్టి ప్ర‌య‌త్నానికి నేటిజ‌న్లు ఫిదా
ద‌ర్శిని బ్యూరో : సాధార‌ణంగా చిన్న పిల్ల‌లు ఏదైనా చేస్తూ చూడ ముచ్చ‌ట‌గా ఉంటుంది.. ఎంత సేపైనా చూడ‌బుద్ద‌వుతోంది. పిల్లలు ఏదైనా చూస్తే అది చేయాలని చూస్తారు. కొందరు టీవీల్లో పాటలు విని పాట పడతారు. కొందరు డ్యాన్స్ చూసి డ్యాన్స్ చేస్తారు. అయితే ఓ బుడ్డోడికి ఆకాశంలోకి ప‌క్షిలా ఎగ‌రాల‌నే ఆశ క‌లిగింది. అంతే రెండు చేతుల‌కు రెండు రెక్క‌లు క‌ట్టుకున్నారు. ఎగ‌రాల‌ని చేసిన ప్ర‌య‌త్నంలో నిజంగానే పక్షి లాగే ఎగిరాడా లేదా అనే వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ఈ వీడియోలో పేదవారు నివసించడానికి తాటి కొమ్మ‌ల‌తో గుడిసె వేసుకుంటూ ఉంటారు. అక్క‌డ‌ ఓ పిల్లాడు తాటి కమ్మలను రెండు చేతులకు కట్టుకున్నాడు. ఆ కమ్మలతో గుడిసె పై నుంచి నేల పైకి దూకాలని అనుకున్నాడు. దూకుతున్నప్పుడు అతను పక్షిలా గాలిలో ఎగరాలనుకున్నాడు. అలా పై నుంచి కింద దూకాడు. ఈ వీడియోను ఐఏఎస్ అశ్విన్ శరణ్ తన అధికారిక ఖాతాలో పస్ట్ చేశారు. “ఇది ఆశ.. అది మిమ్మల్ని ఎగిరేలా చేస్తుంది” అని రాశారు. ఈ వీడియో అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. బాలుడి ప్ర‌య‌త్నానికి ఫిదా అయిన నెటిజ‌న్లు చాలా మంది నువ్వు ఎగరగలవు..ఇది నీకు సాధ్యం కాకపోవచ్చు కానీ.. నువ్వు బాగా చదివి, డబ్బు సంపాదిస్తే విమానాల్లో ఎగరొచ్చు అని కామెంట్ చేశారు.