గేదేను కాటేసిన పిచ్చికుక్క..!

ఆరోగ్యం క్రైం జాతీయం తెలంగాణ హైదరాబాద్

గేదేను కాటేసిన పిచ్చికుక్క..!
– దాని పాలను తాగి దూడ మృతి
– అవే పాలను అమ్మిన యజమాని
– తరువాత ఏం జరిగిందంటే..??
దర్శిని డెస్క్‌: ఈ మద్య కాలంలో వీధి కుక్కలు, పిచ్చి కుక్కలు మనషులతో పాటు మూగజీవాలపై కూడా దాడి చేస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలోని కొమురం భీం జిల్లాలో ఓ పిచ్చి కుక్క గేదెను కాటేసిన సంఘటన షాకింగ్‌కు గురిచేసింది. పిచ్చికుక్క కాటేసిన గెదే పాలను తాగిన దాని దూడ మృతి చెందింది. ఇంకా షాకింగ్‌ గురిచేసిన విషయమేంటంటే పిచ్చి కుక్క కాటేసిన గేదే పాలను దాని యజమానికి ఊరంతా విక్రయించాడు. ఈ సంఘటన రాష్ట్రంలో వైరల్‌గా మారింది. చింతలమానేపల్లి మండలం కేంద్రంలో నివాసం ఉంటున్న నాన్నయ్యకు చెందిన గేదెపై ఓ పిచ్చి కుక్క దాడి చేసి.. గాయపరిచింది. తరువాత గేదె పాలు తాగిన దాని దూడ మృతి చెందింది. గేదేను పిచ్చి కుక్క కాటేసిందని విషయం తెలిసిన యజమాని ఈ విషయం దాచిపెట్టారు. విషయం బయటకు పొక్కితే తన వద్ద పాలు ఎవ్వరు కొనరని దాచిపెట్టారు. యధావిధిగా ఊరంతా పాలు విక్రయించారు. అయితే గేదే దూడ మృతి చెందిందని తెలియడంతో గత కొద్ది రోజులుగా గేదె పాలు తాగిన 300 మంది బాధితులు ఆందోళన చెందుతున్నారు. తమకు ఏమైనా అవుతుందేమో అన్న భయంతో ఆస్పత్రికి పరుగులు తీశారు. వారికి టెస్టులు నిర్వహించిన ఆస్పత్రి సిబ్బంది.. యాంటి రేబిస్ టీకాలు వేశారు. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో.. గ్రామ పంచాయతీ కార్యాలయం లో అత్యవసర మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు అధికారులు. గ్రామం మొత్తాన్ని భయపెట్టిన నాన్నయ్యను అందరూ తిట్టి పోస్తున్నారు.

ఇది కూడా చదవండి…
కంట్లో నుంచి బియ్యం, ప్లాస్టిక్ కవర్లు..!
– వ్యర్థాలు కూడా బయటకు
– ఆరేళ్ల పాపకు వింత వ్యాధి
– కలకలం రేపుతున్న ఘటన
https://dharshininews.com/17255
chaithany collage