అమాయకులపై దుష్ప్రచారం తగదు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

chai jrఅమాయకులపై దుష్ప్రచారం తగదు..!
– స్థలం పసారం కుటుంభీకులది అందరికి తెలుసు
– మా స్థలాన్ని కాపాడుకోవడమే మా ప్రయత్నం
– పసారం బస్వరాజ్‌, పసారం నిషాంక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : సొంత భూమి విషయంలో అమాయకులైన తమపై కొందరు దుష్ప్రచారం చేయడం తగని పని అని తాండూరు పట్టణానికి చెందిన పసారం కుటుంభ సభ్యులు పసారం బస్వరాజ్, పసారం నిషాంక్‌లు అన్నారు. పట్టణంలోని సర్వేనెంబర్ 111లోని విజయ విద్యాలయ పాఠశాల సమీపంలోని భూమిపై వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే.

దీనిపై వారు మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వం నుంచి సర్వేనెంబర్ 111లోని భూమి తమ కుటుంభీకుల పేరుపై ఉందన్నారు. అప్పట్లో విద్యాభివృద్ధికి స్థలం కావాలని కోరడంతో 200 గజాలను వివిహెచ్ఎస్‌ పాఠశాలకు ఇవ్వడం జరిగిందన్నారు. మిగతా 16 గుంటల భూమి మా కుటుంభీకుల పేరుపై ఉందని, ఈ విషయం తాండూరు ప్రజలందరికి తెలుసు అన్నారు. ఇట్టి స్థలాన్ని కొందరు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని తెలిసీ దానిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇది గిట్టని కొందరు వ్యక్తులు తమ కుటుంబంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.

కబ్జా ప్రయత్నం బెడిసి కొట్టడంతో తమను ఇబ్బందికి గురిచేస్తున్నారని అన్నారు. 19 వ శతబ్దం నుండి వారి ఆధీనంలో ఉన్న స్థలం వివిధ వ్యాపారాలకు వాడుకున్నారని ఆరోపించారు. సర్వే నెంబర్ 111 దాదాపు 14 ఎకరాలు ఉందని అన్ని దశల వారిగా మార్పులు జరిగాయని అధికారులకు వివరించడం జరిగిందన్నారు. భూమికి సంబంధించిన అన్ని రిజిస్ట్రేషన్ పేపర్లు , కోర్టు ఆదేశాలు తమ దగ్గర ఉన్నాయని దీని పైన ఎటువంటి న్యాయ పోరాటానికి అయినా ముందుకు వెళ్తామని తెలిపారు. దాన ధర్మాలు కలిగిన పసారం కుటుంబ సభ్యులని ఇబ్బంది పెట్టడం అన్యాయం అని అన్నారు.

ఇదికూడా చదవండి…

కేంద్రంలో మంత్రుల శాఖలు కేటాయింపు