నేడు, రేపు భారీ వర్షాలు

తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

chai jr
నేడు, రేపు భారీ వర్షాలు

– పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్
– ప్రకటించిన వాతావరణ శాఖ
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో నేడు, రేపు భారీ వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రమంతటా వ్యాపించిన నైరుతి రుతుపవనాలు ప్రభావం వల్ల మోస్తరు నంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధ, గురు, శుక్రవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రోజుల్లో ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఈదురుగాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొన్నది.

బుధవారం 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ అప్రమత్తం చేసింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కువరనున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది.

ఇదికూడా చదవండి…

ప్రభుత్వ ఆదీనంలోకి వివాదాస్పద స్థలం