ప్రభుత్వ ఆదీనంలోకి వివాదాస్పద స్థలం

తెలంగాణ రాజకీయం వికారాబాద్

chai jrప్రభుత్వ ఆదీనంలోకి వివాదాస్పద స్థలం
– వీవీహెచ్ఎస్ క్రీడా మైదానంలో బోర్డు ఏర్పాటు
– దగ్గరుండి పాతించిన తహసీల్దార్, అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని వివాదాస్పద భూమిని అధికారులు ప్రభుత్వ ఆదీనంలోకి తీసుకున్నారు. తహసీల్దార్ తారాసింగ్, అధికారులు దగ్గరుండి ప్రభుత్వ భూమి అంటూ బోర్డు ఏర్పాటు చేయించారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణం సర్వేనెంబర్ 111లోని విజయ విద్యాలయ పాఠశాల సమీపంలో 16 గుంటల భూమిపై వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే.

పసారం కుటుంబ సభ్యులు ఇట్టి స్థలం తమదే అంటూ బోర్డు ఏర్పాటు చేయడంతో ఆర్డీఓ శ్రీనివాస రావు ఆదేశాల మేరకు సోమవారం తాండూరు తహసీల్దార్ తారాసింగ్, డిప్యూటి తహసీల్దార్ విజయేందర్ ఆర్‌ఐ, సర్వేయర్లతో కలిసి విచారణ చేపట్టారు. ప్రతివాదుల నుంచి ఇట్టి భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు సర్వేనెంబర్లో లేకపోవడంతో ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు.

ఈ మేరకు మంగళవారం తాండూరు తహసీల్దార్ తారాసింగ్ అధికారులతో కలిసి భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు. వివాదాస్పద స్థలంలో ప్రభుత్వ భూమి అంటూ బోర్డు ఏర్పాటు చేయించారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే కోర్టు ఆదేశాల తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇదికూడా చదవండి…

త్వరలోనే బంగారం లాంటి సాయం..!