ఎమ్మెల్యే సహాకారంతో సమస్యల పరిష్కారానికి కృషి
– టీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం)
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహాకారంతో పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పట్టణ అధ్యక్షుడిగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వారం రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉండడం జరుగుతుందని తెలిపారు. పట్టణంలోని మార్వాడి బజార్లో ఉన్న కార్యాలయంలో వారంలో ప్రతి సోమవారం, బుధవారం, శనివారం రోజులలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండి సమ్యలు తెలుసుకుంటామని చెప్పారు. గుర్తించిన సమస్యలను ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజలు సమస్యలను తెలిపేందుకు సెల్: 9985807124, 9949747151లకు సంప్రదించవచ్చని సూచించారు.


