ఆపరేషన్ థియేటర్లో వీడియో గేమ్..!
– ఆటాడుకుంటూ ఆపరేషన్ చేయించుకున్న రోగి
– సోషల్ మీడియాలో వీడియో వైరల్
దర్శిని డెస్క్ : సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తే, ఇంకొన్ని వెర్రి తనాన్ని తెలియజేస్తాయి. ఇప్పుడు చదివే ఈ సంఘటన ఆ రెండింటిని గుర్తుచేస్తాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో ఓ రోగి వీడియో గేమ్ ఆడుతూ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ వీడియోలో రోగి ఆపరేషన్ గదిలో మంచం మీద పడుకుని ఉండగా డాక్టర్ శస్త్రచికిత్స చేస్తున్నట్లు కనపడుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆ యువకుడు మొబైల్ లో వీడియో గేమ్‌లు ఆడుతున్నాడు. ఈ వీడియోను సర్జరీ చేసిన అనస్థీషియా టెక్నాలజిస్ట్ డాక్టర్ సుమిత్ ఘోష్, డయాలసిస్ టెక్నీషియన్ డాక్టర్ పింకీ ముఖర్జీ నెట్టింట షేర్ చేశారు. డాక్టర్. ఘోష్, ముఖర్జీ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేస్తూ.. ‘ఆట కొనసాగుతుంది, ఆపరేషన్ కొనసాగుతుంది. అన్నీ అనస్థీషియా వల్లనే. అనస్థీషియా ఎవరికీ నొప్పిని కలిగించదు.’ అని చెప్పుకొచ్చారు.
ఈ వీడియోకు లక్షల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఓరి దేవుడా.. ఆపరేషన్ చేయించుకోవడం ఇంత తేలికన అంటూ కొందరు కామెంట్ చేయగా.. మరికొందరేమో ఆలా ఎలా చేయగలిగావ్ బాస్ అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో బ్రెయిన్ సర్జరీ సమయంలో ఓ వ్యక్తి గిటార్ వాయిస్తూ కనిపించాడు.
వీడియో కోసం కింద చూడండి..
ఇదికూడా చదవండి…

