మేమున్న సిటీలోనే మొదటి పేలుడు
– భయం భయంగానే గడిపాం
– 5,6 గంటలు బంకర్లలో తలదాచుకున్నాం
– ఇండియన్ ఎంబసీ, తెలంగాణ సర్కారు వల్లే స్వదేశానికి వచ్చాం
– భారత, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
– తాండూరుకు చేరుకున్న ఉక్రేయిన్ విద్యార్థి మదీహా అనమ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉక్రేయిన్ – రష్యా భీకర యుద్ద వాతావరణంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయం భయంగా గడిపామని, బతుకుతామో లేదో సంఘర్షణల మధ్య ఇండియన్ ఎంబసీ, తెలంగాణ రాష్ట్ర సర్కారు సహాకారంతోనే స్వదేశంలోని స్వస్థలానికి చేరుకున్నామని ఉక్రేయిన్ నుంచి వచ్చిన తాండూరు విద్యార్థి మదీహా ఆనమ్ తెలిపింది. శనివారం తాండూరు పట్టణానికి చేరుకున్న ఆమె స్థానిక టీఆర్ఎస్ నాయకులు మసూద్‌కు సంబంధించిన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
స్వదేశం, స్వస్థలానికి చేరుకున్న విషయాలు ఆమె మాటల్లోనే.. ఎంబీబీఎస్ చదువు కోసం 2019లో ఉక్రేయిన్లో వెళ్లడం జరిగింది. అక్కడి ఇవానో ఫ్రాన్స్ క్లీ యూనివర్సిటీలో 4 సంవత్సరం చదువు కొనసాగుతుంది. ఉక్రేయిన్- రష్యాల మధ్య యుద్ధ ప్రకటన వెలువడినా కూడ తాము ఉన్న దక్షిణ ప్రాంతంలో యుద్దం జరగదని భావిస్తే 24న మొదట తాము ఉంటున్న సమీప ప్రాంతంలో అణు దాడి జరిగింది.
అనుక్షణం భయమే..
మేము నివాసం ఉండే ఏయిర్ పోర్టుపై మొదటి దాడి చేయడంతో భయం మొదలైంది. ఏయిర్ పోర్టుపైనే దాడిన వాళ్లు మా భవనంపై కూడ పేలుళ్లు జరుపుతారని భయం వేసింది. అప్పటికీ మొదలైన యుద్ధంలో ప్రాణాలను కాపాడునేందుకు ప్రతి 15 నిమిషాలకు వచ్చే సైరన్ సంకేతాలతో అక్కడి దేశం ఆదేశాల మేరకు బంకర్లలలో తలదాచుకోవాల్సి వచ్చింది. దాదాపు 5.6 గంటలకు ఉండిపోవాల్సిన పరిస్థితితో బిక్కు బిక్కుమంటూ గడిపాం. కుటుంబ సభ్యులకు, తెలిసిన వారికి విషయం తెలిపేందుకు ఎలాంటి ఫోన్లు లేకపోయాయి.
ఇబ్బందులు పడుతూ సరిహద్దుకు
దీనికి తోడు యూనివర్సీటిలో ఎవరి ప్రాంతాలకు వాళ్లు వెళ్లిపోవాలని చేసిన ప్రకటనతో స్వదేశానికి వెళ్లిపోవాలని తెలిపింది. దీంతో దాదాపు 18 మంది భారతీయ విద్యార్థులతో కలిసి డబ్బులు పొదుపు చేసే బార్డర్ చేరాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ క్రమంలో స్లోవాకీయ సరిహద్దు చేరుకునేందుకు కష్టాలు పడాల్సి వచ్చింది. 5.6 గంటల్లో చేరుకునే ప్రాంతాన్ని 12 గంటలకు పైగా ప్రయాణం చేయాల్సి వచ్చింది. కాని సరిహద్దుకు 5 కిలో మీటర్ల దూరంలోనే దించేశారు. దాదపు 200 మంది ఒకే ప్రాంతంలో చలిలో కష్టపడే సరిహద్దుకు చేరుకోవాల్సి వచ్చింది. సరిహద్దుకు చేరుకున్నాకా మైనస్ 5 డిగ్రీలోనే తిండి లేకుండా తిప్పలు పడాల్సి వచ్చింది.
స్పష్టమైన ఆదేశాల కోసం ఎదురు చూపు
కాని సరిహద్దు చేరుకున్నాకా మమ్మల్ని ఇండియా తీసుకువచ్చేందుకు ఇండియన్ ఎంబసీ నుంచి స్పష్టత రాలేదు. తిరిగి వెళ్లిపోదామనుకుంటే కూడ భయం వేసింది. సరిహద్దు దాటిన వారిపై భారత ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలనే డిమాండ్ మేరకు హద్దు దాటేందుకు అవకాశం కలిగింది.
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రీజేజూ, తెలంగాణ రాష్ట్ర మంత్రి కె. టీఆర్, ఎంపీ రంజిత్ రెడ్డిల సహాకారంతో ఢిల్లీ చేరుకునేందుకు సాధ్యమయ్యందని తెలిసింది. దీంతో స్లోవాకియా సరిహద్దు నుంచి మొదటి సారి మొదటి బ్యాచ్ కింద స్వదేశానికి చేరుకున్నాం. మంత్రి కేటీఆర్, ఎంపీ రంజిత్ రెడ్డిల సహాకారంతో ప్రత్యేక విమానం(స్పైస్ జెట్)లో తక్కువ సమయంలోనే ఢిల్లీకి చేరుకున్నాం. అక్కడి నుంచి ఆపరేషన్ గంగా ద్వారా హైదరాబాద్ కు ఆపరేషన్ గంగా ద్వారా చేరుకున్నాం. స్వస్థలానికి చేరేందుకు సహకరించిన భారత రాష్ట్ర ప్రభుత్వాలకు రుణపడి ఉంటాం. అదేవిధంగా మధ్యలో ఆగిపోయిన తమ చదువులపై స్పష్టత తీసుకవచ్చేందుకు భారత రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతాం.
మదీహా ఆనమ్‌ను పరామర్శించిన చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
మరోవైపు ఉక్రేయిన్ నుంచి తాండూరుకు చేరుకున్న మెడికల్ విద్యార్థిని మదీహా ఆనమ్‌ను మున్సిపల్ చైర్ ఫర్సన్ స్వప్న పరిమళ్ పరామర్శించారు. క్షేమంగా తిరిగి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు.
ఉక్రేయిన్ నుంచి తాండూరుకు చేరుకునేంత వరకు ఎదుర్కొన్న సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ వి ద్యార్థులను సురక్షితంగా తరలించడంలో తెలంగాణ సర్కారు బాధ్యత తీసుకుందన్నారు. ఇందులో భాగంగానే స్వస్థలానికి చేరుకునేందుకు మంత్రి కేటీఆర్, ఎంపీ రంజిత్ రెడ్డిలు ప్రత్యేక చొరవ చూపించారన్నారు. ఎలాంటి అవసరమున్నా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పద్దోళ్ల రత్నమాల నర్సింలు, టీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, ఫ్లోర్ లీడర్ అబ్దుల్ రజాక్, నాయకులు మక్సూద్, వెల్పేర్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు కమల్ అతహర్ కుటుంబ సభ్యులు ఉన్నారు

