వీధి వ్యాపారులకు స్పెషల్ మార్కెట్..!
– తాండూరులో షెడ్ల ఏర్పాటుకు కసరత్తు
– మెప్మా ఆధ్వర్యంలో వ్యాపారులకు చేయూత
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్లో వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక మార్కెట్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు మెప్మా ఆధ్వర్యంలో కసరత్తును ప్రారంభించారు. వీధి వ్యాపారులు రోడ్లపై విక్రయాలు చేయరాదనే ఉద్దేశంతో షెడ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, పరిగి, కోడంగల్, తాండూరు మున్సిపాల్టీలను ఎంపిక చేయగా ముందుగా తాండూరులో షెడ్లను ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ స్ట్రీట్ వెండింగ్ స్కీం-2016 కింద షెడ్ల నిర్మాణానికి రూ. 9లక్షల 50వేలను మంజూరు చేసింది. మొత్తం 25 షెడ్లను కేటాయించారు.
ఒక్కో షెడ్డు 6.6ఫీట్లు, ఎత్తు 10 ఫీట్లు, 2 ఫీట్ల ఫ్లాట్ ఫామ్, 3 ఫీట్ల అండర్ గ్రౌండ్ బేస్ మెంట్ తో నిర్మించాలని ప్రతిపాదనలు సిద్దం చేశారు. మొదటి విడతలోనే ప్రభుత్వం రాష్ట్ర ప్రాజెక్టు అధికారులు మెప్మా ఖాతాలో జమ చేశారు. ఈ మేరకు మెప్మా ఆధ్వర్యంలో ఇప్పటికే తాండూరులో షెడ్ల నిర్మాణానికి స్థలాన్ని కూడా పరిశీలించారు. పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం వల్ల ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఇక్కడ కాకుండా మరో చోట ఏర్పాటు చేయాలని కమీషనర్ సూచించడంతో వాయిదా పడింది. తాండూరు పట్టణంలో వ్యాపారుల కోసం కొత్త మార్కెట్ ఏర్పాటు కోసం స్థల అన్వేషణ కొసాగుతోంది.
ఇదికూడా చదవండి…

