పచ్చని చెట్లపై గొడ్డలి పెట్టు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పచ్చని చెట్లపై గొడ్డలి పెట్టు..!
– నాటాల్సిన చేతులే.. నరికించాయి
– తాండూరు మున్సిపల్ అధికారుల తీరు
– కార్యాలయంలో అక్రమంగా చెట్ల తొలగింపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పర్యావరణానికి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సందేశాలు.. అవగాహన కల్పించాల్సిన అధికారులు పచ్చని చెట్లపై గొడ్డలి పెట్టు పడేందుకు కారకులయ్యారు.
kvcs
తాండూరు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో అక్రమంగా చెట్లను నరికించిన తీరు చర్చనీయాశంగా మారింది. మున్సిపల్ కార్యాలయం వెనుక భాగంలో మహిళ స్వశక్తి భవనంతో పాటు తాగునీటి ట్యాంకు పరిసర ప్రాంతాల్లో పచ్చని చెట్లు ఉన్నాయి. శనివారం ఉదయం నుంచి కొందరు పచ్చని చెట్లను నరికివేసే పనులు చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా కూలీలతో చెట్లను రంపాలతో నరికించి వేశారు. అధికారులను ఆరా తీయగా తమకేమి సమాచారం లేదని చెప్పుకొచ్చారు.

మున్సిపల్ ఇంచార్జ్ గా ఉన్న డీఈ మణిపాల్ ను వివరణ కోరగా కార్యాలయ వెనుక భాగంలో ఉన్న చెట్లకు కొమ్మలను మాత్రమే తొలగించాలని కాంట్రాక్టు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అయితే కాంట్రాక్టర్ కొమ్మలతో పాటు చెట్లను మొదళ్లతో నరికివేసి ఉంటారని తెలిపారు. ఇంచార్జ్ ద్వారా విషయం తెలుసుకున్న మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి చెట్లను నరికి.. తీసుకెళుతున్న ట్రాక్టర్ ను అడ్డుకున్నారు.

మరోవైపు మున్సిపల్ ఆవరణలో చెట్లే అయినా నరికివేయాలంటే అటవి శాఖ అధికారులు నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని అధికారులే పేర్కొంటుండం గమనార్హం. అయితే కార్యాలయ ఆవరణలోని చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా నరికేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం తెలిసిన పలువురు చెట్లను నాటి సంరక్షించాల్సిన అధికారులే చెట్లను నరికించడం విడ్డూరంగా ఉందని విమర్శిస్తున్నారు.

ఇదికూడా చదవండి..

పేద విద్యార్థులకు ఎడ్యూకేషన్ లోన్‌..!