డ్వాక్రా, ఆరోగ్య కేంద్రం మంజూరు
– ఘనాపూర్ వార్డులో నిర్మాణంకు అనుమతులు
– ప్రొసిడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– ఎమ్మెల్యేకు కౌన్సిలర్ సోమ శేఖర్ కృతజ్ఞతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి 34వ వార్డులో కొత్తగా డ్వాక్రా భవనం, ఆరోగ్య కేంద్రం మంజూరయ్యాయి. వార్డులోని ఘనాపూర్ లో నిర్మించేందుకు అనుమతులు జారీ అయ్యాయి. మంగళవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఇందుకు సంబంధించిన ప్రొసిడింగ్స్ ను అందజేశారు. డ్వాక్రా భవం, ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చె సిందని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా వార్డు కౌన్సిలర్, టీజేఎస్ ఫ్లోర్ లీడర్ సోమశేఖర్ ప్రొసిడింగ్స్ ను అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సోమశేఖర్ కృతజ్ఞతలు తె లిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, వెంకన్న గౌడ్, బోయరవి తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి..

