మరుపురాని నేత మాణిక్‌ రావు

తాండూరు రాజకీయం వికారాబాద్

మరుపురాని నేత మాణిక్‌ రావు
– స్పూర్తి రాజకీయాలు నేర్పిన ఉద్దండుడు
– వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్
– ప్రియ శిష్యుడుగా వర్దంతిలో నివాళులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన స్వర్గీయ మాజీ మంత్రి మాణిక్ రావు మరుపురాని నేత అని వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని డీసీఎంఎస్ కార్యాలయం వద్ద ఉన్న మాణిక్ రావు విగ్రహానికి రాజుగౌడ్ నివాళులు అర్పించారు. వర్దంతి సందర్బంగా ఆయన ప్రియ శిష్యుడుగా రాజుగౌడ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ స్వర్గీయ మాజీ మంత్రి మాణిక్‌ రావు ద్వారా తమలాంటి యువ నాయకులు రాజకీయాల్లోకి రావడం జరిగిందని గుర్తుచేశారు. మూడు సార్లు మంత్రి పదవులు చేపట్టిన ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. తాండూరు ప్రాంత విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన మాణిక్‌ రావు ఎందరో నాయకులకు స్పూర్తి రాజకీయాలు నేర్పిన ఉద్దండుడు అని అభివర్ణించారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తూ గుర్తించుకోవాల్సిన అవసరముందన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు.

తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కూడా బీసీలతో పాటు అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యమిస్తున్నారని అన్నారు. బీసీల కోసం పనిచేవారికి అండగా ఉండాలన్నారు. బీసీల అభివృద్ధికి తామూ కూడా అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షులు హరిహరగౌడ్, నాయకులు కరుణకార్, బబ్ల్యూ, సిద్దు, శివానంద్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!