ఆపరేషన్ స్ట్రీట్ డాగ్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఆపరేషన్ స్ట్రీట్ డాగ్..!
– తాండూరులో కుక్కల వేట షురూ
– స్పెషల్ టీంలతో క్యాచింగ్
– యనిమల్ కేర్ సెంటర్‌కు తరలింపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్లో వీధి కుక్కల వేట ప్రారంభమయ్యింది. ప్రత్యేక బృందాలతో వీధి కుక్కలను పట్టుకుంటున్నారు. గత కొన్ని నెలలుగా తాండూరులో కుక్కల బెడధ అధికం కావడంతో పాటు పలువురుపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. కొన్ని సందర్భాలలో బయటకు రావాలంటే జనం జంకే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విషయంపై రాజకీయ దుమారం రేగడంతో మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టాలని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో మున్సిపల్ తరుపున చర్యలు చేపట్టారు. తాజాగా ఆదివారం తాండూరు పట్టణంలో వీధి కుక్కల వేట ప్రారంభ మయ్యింది. పట్టణంలోని ముత్యాల గల్లికి చెందిన వ్యక్తుల బృందాలతో వేటను ప్రారంభించారు. వీధిలో సంచరిస్తున్న కుక్కలను పట్టుకుని బోనులోకి ఎక్కించారు. ఇలా పట్టుకున్న కుక్కలను తాండూరు మున్సిపల్ కు చెందిన అంతారం గుట్ట సమీపంలో ఉన్న డంపింగ్ యార్డులో ఏర్పాటు చేసిన యానిమల్ కేర్ సెంటర్ కు తరలించారు. అక్కడ వీధి కుక్కలకు నింయత్రణ చర్యలు తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పట్టణంలో వీధి కుక్కల వేట ప్రారంభం కావడంతో పలువురు ఊరట వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి…

ఉపాధి సిబ్బందికి తీపికబురు..!