ఆరు గ్యారెంటీలతో అంతా దగా..!
– ప్రజా పాలనతో సాధించిందేమి లేదు
– కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు తప్పదు
– బీఆర్ఎస్ ద్రోహుల వల్లే అభ్యర్థుల ఓటమి
– ఎన్నికల ముందు రేవంత్ రెడ్డితో రహస్య భేటి
– పార్టీ దుర్మార్గుల దురాగతాలను బైటపెడతా
– తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆరు గ్యారెంటీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ రేవంత్ సర్కారు దగా పాలన చేస్తుందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలతో గారడి చేస్తుందన్నారు. ఆరు గ్యారెంటీ పథకాలలో మొత్తం 13 హామీలు ఉండగా మహాలక్ష్మీ కింద ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పథకాలను మాత్రమే అమలు చేస్తూ గొప్పలు పోతుందన్నారు. గత బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు అయిన ఆసరా, రైతుబంధు, దళితబంధు, సీఎం రిలీఫ్ ఫండ్ వంటి సంక్షేమ పథకాలను రద్దు చేసి.. పేదలను ఇబ్బందుల పాలు చేస్తుందని అన్నారు.
కాంగ్రెస్‌కు ఓటు ఎందుకువేశామనే పరిస్థితి తీసుకవచ్చారని ఆవేధన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఖరీఫ్ ధాన్యం సేకరణలో రైతులకు బోనస్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు అమలు చేసిన దళితబంధు కింద రూ. 10 లక్షలు అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 12 లక్షలు ఇస్తామని చెప్పిందని. ఇచ్చిన హామిని ఎందుకు విలుపుకోవడం లేదన్నారు. దళితబంధు పేరు నచ్చకుంటే ఇందిరమ్మ బంధు అనే పేరు పెట్టి అయినా పంపిణీ చె యాల్సిందని అభిప్రాయపడ్డారు. గొల్ల కుర్మలు సబ్సిడీ గొర్రెల కోసం డీడీలు కట్టినా యూనిట్లను మంజూరు చేయడం లేదన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం గతంలో పంపిన దరఖాస్తులు, తాజాగా పంపిన దరఖాస్తులకు మంజూరు చేయడంలేదన్నారు. ఆపదలో ఉన్న పేదల దరఖాస్తులను పక్కన పెట్టడం బాధాకరమన్నారు. గృహలక్ష్మీ పథకాన్ని కూడా రద్దు చేసి నియోజకవర్గంలో 14వేల మంది పేదల సొంతింటి కలను నిర్వీర్యం చేసిందన్నారు.
సంక్షేమ పథకాల పేర్లు మార్పు
అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అమలు చేసిన పథకాల పేర్లను మార్చేందుకు యత్నిస్తుందన్నారు. ధరణిని భూమాతగా, రైతుబంధును రైతు భరోసాగా. కేసీఆర్ కిట్ ను మాతా శిశు ఆరోగ్యంగా, ఆసరా ఫించన్ ను చేయూతగా, గృహలక్ష్మీని ఇందిరమ్మ ఇళ్ల పథకంగా, ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చె పట్టిన ప్రజా పాలనతో పేదలకు ఒరిగిందేమి లేదన్నారు. దరఖాస్తుల స్వీకరణ తరువాత డాటా ఎంట్రీ పేరుతో లబ్దిదారులను మోసం చేస్తుందని విమర్శించారు. తెల్ల రేషన కార్డులు ఇవ్వకుండా లబ్దిదారుల ఎంపిక ఎలా చేస్తారని ప్రశ్నించారు.
అభివృద్ది పనుల రద్దు
అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో తాను ఎమ్మెల్యేగా సాధించిన నిధులను రద్దు చే ఎందుకు యత్నిస్తుందన్నారు. టఫ్ఐడీసీ కింద తాండూరును వరదల నుంచి కాపాడేందుకు రూ. 16 కోట్లతో చిలుకవాగు డ్రెస్ నిర్మాణంను రద్దు చేశారని, స్మశానవాటికల అభివృద్ధికి తీసుకవచ్చిన రూ. 1.35 నిధులు నిలిపివేశారని, పట్టణంలోని ఆదర్శనగర్ లో రూ. 6 కోట్లతో నిర్మిస్తున్న థీమ్ పార్కు నిర్మాణాన్ని కూడ రద్దు చేశారని తెలిపారు. అభివృద్ధిని. సంక్షేమాన్ని రద్దు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసి ఎందుకు గెలిపించాలని ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. పద్దతి మార్చుకోకపోతే ప్రజల చేతిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరుగుబాటు తప్పదన్నారు.
బీఆర్ఎస్ ద్రోహులను బయటను పెడతా
మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ద్రోహుల వల్లే అభ్యర్థులు ఓటమి పాలయ్యారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి మోసం చేసే వారిని వదిలే ప్రసిక్తే లేదన్నారు. తాండూరు, వికారాబాద్, కోడంగల్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి కారుకులు ఎవరో అందరికి తెలుపన్నారు. ఎన్నికల సమయంలో హైదరాబాద్ లో రేవంత్ రెడ్డిని రహస్యంగా కలిసింది ఎవరు, తాండూరు, వికారాబాద్ లలో అభ్యర్థులను ఓడించి గిఫ్ట్‌గా ఇస్తానని రేవంత్ రెడ్డితో చెప్పింది ఎవరో అనేది త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు. ఈ విషయాలు అన్ని అధిష్టానానికి తెలిసినా సమయం వచ్చినప్పుడు వాళ్లే మాట్లాడుతారని స్పష్టం చేశారు.
ఇదికూడా చదవండి…

