గౌతాపూర్ రోడ్డు ప్రారంభంపై హర్షం
– ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన వ్యాపారి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నియోజకవర్గ రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ సహాకారంతో నియోజకవర్గ పరిధిలోని రోడ్లకు నిధులు సాదించారు. ఇందులో భాగంగా తాండూరు నుంచి గౌతాపూర్ రోడ్డుకు నిధులు మంజూరు అయ్యాయి. శనివారం పట్టణంలోని సెయింట్ మార్క్స్ స్కూల్ నుంచి గౌతాపూర్ వరకు రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఈ రోడ్డు పనులు ప్రారంభం కావడం పట్ల తాండూరు పట్టణంకు చెందిన ప్రముఖ నాపరాతి వ్యాపారి వినోద్ లాల హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో రోజులుగా దుమ్ము, దూళీ వల్ల మార్గంలో ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ క్రమంలో రోడ్డు పనులు ప్రారంభం ఉపశమనం కలిగిందన్నారు. ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని వినోద్ లాల కృతజ్ఞతలు తెలిపారు.
ఇదికూడా చదవండి…

