సింగిల్‌ రోడ్లకు మహర్ధశ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సింగిల్‌ రోడ్లకు మహర్ధశ..!
– డబుల్‌ రోడ్లుగా అప్‌గ్రేడ్‌
– నెరవేరుతున్న తాండూరు వాసుల కల
– ఎమ్మెల్యే మనోహరన్న విశేష కృషి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని సింగిల్‌ రోడ్లకు మహర్దశ పట్టబోతోంది. ఈ సింగిల్ రోడ్లను డబుల్‌ రోడ్లుగా ఆఫ్‌గ్రేడ్‌ చేసేందుకు చర్యలు వేగవంతం అవుతున్నాయి. దాదాపు మూడు సింగిల్‌ రోడ్లను డబుల్‌ రోడ్లుగా మారుస్తున్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చూపిన ప్రత్యేక చొరవతో రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరైన సంగతి తెలిసిందే. తాండూరు – వికారాబాద్‌ రోడ్డు, బషీరాబాద్ – కరణ్‌ కోట్ రోడ్డు, మహబూబ్ నగర్ – చించొల్లి మార్గంలోని పట్టణ రోడ్లను డబుల్‌ రోడ్లుగా అభివృద్ధి చేయబోతున్నారు. రూ. 100 కోట్లతో తాండూరు – వికారాబాద్ మార్గంలో ఉన్న 39 కిలో మీటర్ల రోడ్డును శాశ్విత ప్రతిపాదికగా డబుల్‌ రోడ్డుగా మార్చాలని నిర్ణయించారు.

అదేవిధంగా బషీరాబాద్‌ – కరణ్‌ కోట్ మార్గంలోని 12 కిలో మీటర్ల రోడ్డును రూ. 30కోట్లతో డబుల్‌ రోడ్డుగా అభివృద్ధి చేయబోతున్నారు. దీంతో పాటు మహాబూబ్ నగర్ – చించొల్లి మార్గంలో నిర్మిస్తున్న జాతీయ రహదారిలో రూ. 30 కోట్లతో తాండూరు పట్టణంలో సుమారు 4 కిలో మీటర్ల మేర డబుల్ లైన్, ఫోర్‌ వే లైన్ రోడ్డును విస్తరించనున్నారు. తాండూరులో గత దశాబ్దకాలంగా రోడ్ల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించలేదని విమర్శలు ఉన్నాయి. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక కృషితో సుమారు 55 కిలో మీటర్ల సింగల్‌ రోడ్లు డబుల్‌ రోడ్లుగా మారబోతున్నాయి.

ఇదికూడా చదవండి…

గ్రూప్‌-3 పరీక్షలకు ఏర్పాట్లు..!