పైలెట్ గెలుపును ఆపలేరు..!
– కాంగ్రెస్ గ్యారెంటీని ఎవ్వరు నమ్మరు
– బీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ ఖాయం
– మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే ఎన్నికల్లో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గెలుపును ఎవ్వరు ఆపలేరని తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సంక్షేమ ప థకాల అమలుతో పాటు, ఎన్నడు లేని విధంగా అభివృద్ధిని చేపట్టారని అన్నారు. ఆయన చేసిన అభివృద్ధి, సర్కారు సంక్షేమ పథకాన్ని చూసి ప్రజలు ఎన్నికల్లో ఆయనకు బ్రహ్మరథం పట్టడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ వస్తుందన్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల స్పష్టత విషయంలో గందరగోళం ఏర్పడిందన్నారు. దీంతో ఆ పార్టీకి ఆదరణ దక్కడం లేదన్నారు. ఆ పార్టీ గ్యారెంటీ పథకాలను కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని విమర్శించారు. కర్ణాటకలో ఇచ్చిన గ్యారెంటీ హామీలు అమలు చేయలేక పోతున్నారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలకు తాయిలాలు ఇచ్చి ఫిరాయింపులు చేసినా పైలెట్ దూకుడును అడ్డుకోలేరన్నారు. ప్రజలు, నేతలు, కార్యకర్తలు పైలెట్ వైపు ఉన్నారని, ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బంపర్ మెజార్టీ అందించడం ఖాయమన్నారు.
ఇది కూడా చదవండి…

