23న రాజ్ కుమార్ బర్త్ డే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

23న రాజ్ కుమార్ బర్త్ డే..!
– అదే రోజు ఉచిత కంటి వైద్య శిబిరం
– గ్లోబల్ యువతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన బీసీ నాయకుడు, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ జన్మదినోత్సవాన్ని ఈనెల 23న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్లోబల్ యువతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన శంకర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ఫౌండేషన్ వ్యవస్థాపకులు మంబాపురం విజయేందర్, ప్రధాన కార్యదర్శి అరుణ్ రాజ్‌లు తెలిపారు. సోమవారం తాండూరు పట్టణంలోని మంతటి ఫాండయ్య కళ్యాణ మండపంలో ఉదయం 9-30గంటల నుంచి కంటి వైద్య శిబిరం కొనసాగుతుందని తెలిపారు. ఈ శిబిరానికి తరలివచ్చి ఉచిత కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో కంటి ఆపరేషన్లు అవసరమైన వారికి శంకర్ కంటి ఆసుపత్రిలో ఆపరేషన్లు చేయించడం జరుగుతుందన్నారు. శిబిరానికి వచ్చేవారు ఆధార్ కార్డు, ఓటరు, కార్డు, రేషన్ కార్డుతో పాటు ఇదివరకు ఆసుపత్రిలో చూపించుకున్న రసీదులు తీసుకరావాలని సూచించారు.

ఇదికూడా చదవండి…

జామా జ్యూస్‌లో ఆరోగ్య రహస్యాలు..!