మైమరిపించిన చిన్నికృష్ణులు, గోపికలు

తాండూరు రాజకీయం వికారాబాద్

మైమరిపించిన చిన్నికృష్ణులు, గోపికలు
– వీవీటీఎస్‌లో ఘనంగా కృష్ణాష్టమి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని వేదిక్ విశిష్ట ది స్కూల్(వీవీటీఎస్)లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని శనివారం వేదిక్ విశిష్ట ప్లే స్కూల్లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు చిన్ని కృష్ణులు, గోపిక, యశోధల వేషాధారణలో ఆకట్టుకున్నారు. స్కూల్ ఆవ‌ర‌ణ‌లో శ్రీకృష్ణ.. గొల్లభామల ప్రదర్శనలతో విద్యార్థులు మైమరిపించారు. గోపికలు, శ్రీకృష్ణులతో ఉట్టికొట్టే కార్యక్రమాలతో స్కూల్ ప్రాంగణం గోకులంలా మారిపోయింది.

మరోవైపు ఈ కార్యక్రమానికి వార్డు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ హాజరై చిన్ని కృష్ణులు, గోపికలను అభినందించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ సుహాస్, ప్రిన్సిపల్ నాగభూషణం, డైరెక్టర్లు రాములు, మహిపాల్ రెడ్డి, మంజుల, మేనేజ్ మెంట్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.