వారం రోజులు సంక్రాంతి సెలువులు..!
– స్కూల్లు, కాలేజీలకు ఇచ్చిన రోజులు ఇవే
– ప్రకటించిన తెలంగాణ విద్యాశాఖ
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఈ యేడాదిలో వస్తున్న సంక్రాంతి పండగ సెలవులను తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలకు ఇచ్చిన సెలవులను వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సంక్రాంతి సెలవులకు సంబంధించిన ఉత్తర్వులను విద్యాశాఖ జారీ చేసింది. జనవరి 11 నుంచి జనవరి 17వ తేదీ వరకు(జనవరి 11 రెండో శనివారం, 12న ఆదివారం) వారం రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జనవరి 18వ తేదీన మళ్లీ పాఠశాలలు పునః ప్రారంభంకానున్నాయి. ఇక జూనియర్ కాలేజీలకు 11 నుంచి 16 వరకు సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. అయితే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంకా సెలవు తేదీలను అధికారికంగా ప్రకటించలేదు.
ఇదికూడా చదవండి…

