తాండూరులో బాల్కీ గ్యాంగ్ హల్ చల్..!
– గ్రామాల్లో తాళాలు వేసిన ఇండ్లనే టార్గెట్
– గుట్టు చప్పుడు కాకుండా చోరీలు
– ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేసిన పోలీసులు
– జాగ్రత్తంగా ఉండి.. వివరాలు తెలియజేయాలని సూచన
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా సరిహద్దు తాండూరు నియోజకవర్గంలో బాల్కీ గ్యాంగ్ బెంబేలెత్తిస్తోంది. కర్ణాటక ప్రాంతానికి చెందిన ఈ గ్యాంగ్ తాండూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. బుధవారం తాండూరు రూరల్ పరిధిలోని కరణ్ కోట్ పోలీసులు ఈ గ్యాంగుకు సంబంధించిన ఫోటోలు, వీడీయోలు రిలీజ్ చేశారు. ఈనెల 1న తాండూరు మండలం కోనాపూర్ గ్రామంలో నాలుగు ఇండ్లలో చోరీలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ చోరీల వెనక కర్ణాటకకు చెందిన బాల్కి గ్యాంగ్ ఉన్నట్లు నిరార్దించారు.
చోరీ నేపథ్యంలో సీసీ కెమెరాలను పరిశీలించగా ఈ విషయం బహిర్గతమయ్యింది. మొత్తం ముగ్గురు నుంచి నలుగురు వ్యక్తులు ఉండే ఈ గ్యాంగ్ గ్రామాల్లో తిరుగుతారని, ఆయా గ్రామాల్లో తాళాలు వేసిన ఇంటిని టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతారని గుర్తించారు. చోరీ చేయాల్సిన గ్రామానికి సమీపంలో ఏదో ఒక ప్రాంతంలో రాత్రి పూట బసచేసి అర్దరాత్రి తరువాత చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. వచ్చిన పని ముగిశాక అక్కడి నుంచి వెళ్లిపోతారని తెలిపారు.
ఈ క్రమంలోనే తాండూరు మండలం కోనాపూర్ గ్రామంలో చోరీలకు పాల్పడినట్లు అంచనాకు రావడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈ గ్యాంగ్ కోనాపూర్‌తో పాటు తాండూరు నియోజకవర్గం తాండూరు మండలం ఖాంజాపూర్, యాలాల మండలం కోకట్ గ్రామాల శివారులో సంచరించినట్లు తెలిసిందని పోలీసులు చెబుతున్నారు. గ్రామాల ప్రజలు, పట్టణ వాసులు అప్రమత్తంగా ఉండాలని, ఈ గ్యాంగు గురించి ఏమైనా సమాచారం తెలిస్తే.. DSP TANDUR – 8712670017, CI TANDUR (R) – 8712670051, CI TANDUR (T) – 8712670049, SI KARANKOT – 8712670052, SI YALAL. – 8712670054, SI PEDDEMUL – 8712670053, SI BASHIRBAD- 8712670055లకు సమాచారం అందించాలని సూచించారు.
ఇదికూడా చదవండి….

