సదరం క్యాంపు షెడ్యూల్ విడుదల..!
– జిల్లాలో స్లాట్ బుకింగ్‌కు అవకాశం
– ప్రకటించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వికారబాద్ జిల్లాలో వికలాంగులకు జిల్లా అధికారులు కీలక ప్రకటన చేశారు. 24వ తేది నుంచి జిల్లాలో నిర్వహించిన సదరం క్యాంపు షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మీసేవాలో స్లాట్ బుకింగ్ అవకాశం కల్పిస్తున్నట్లు ఓ ప్రకటన జారీ చేశారు. ఈనెల 24, 30,31. తేదీల్లో తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అంగవైకల్యం, బుద్ది మాంద్యము, చెవుడు, మూగ విభాగాలలో క్యాంపులు జరుగుతాయని తెలిపారు. అదేవిధంగా ఈనెల 27, 30 వ తేదీల్లో వికారాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అంగ వైకల్యం, కంటి లోపం విభాగాలకు క్యాంపులు జరుగుతాయని చెప్పారు.
ఈ నేపథ్యంలో సదరం క్యాంపుకు సంబంధించి 23వ తేది మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుండి మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. గతంలో సదరం సర్టిఫికెట్ పొంది సర్టి ఫికేట్ కాల పరిమితి అయిపోయిన వారితోపాటు కొత్తగా స్లాట్ బుక్ చేసుకొన్న వారు హాజరు కావాలని స్పష్టం చేశారు.
క్యాంపు వివరాలు,
24.01.2O24 అంగ వైకల్యం – ప్రభుత్వ ఆసుపత్రి, తాండూరు
30.01.2024.బుద్ధి మాంద్యము – ప్రభుత్వ ఆసుపత్రి, తాండూరు
31.01.2024 చెవుడు మూగ – ప్రభుత్వ ఆసుపత్రి, తాండూరు
27.01.2024 అంగవైకల్యం- సీహెచ్‌సీ ఆసుపత్రి, వికారాబాద్
30.01.2024. అంధులు – సీహెచ్‌సీ ఆసుపత్రి, వికారాబాద్
ఇదికూడా చదవండి…

