అక్షరలో అట్టహాసంగా అక్షరాభ్యాసం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అక్షరలో అట్టహాసంగా అక్షరాభ్యాసం..!
– పాఠశాలో ఘనంగా వసంత పంచమి
– చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన తల్లిదండ్రులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ రోడ్డు మార్గంలోని అక్షర కాన్సెప్ట్ స్కూల్లో చిన్నారులకు అక్షరాభ్యాస మహోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. సోమవారం వసంత పంచమి సందర్భంగా జుంటుపల్లి రామాలయ ప్రధాన అర్చకులు వరదరాజు జోషి, తాండూరు ఉత్తరాధి మఠం వ్యవస్థాపకులు సుధీంద్ర పంతులు వేద మంత్రోచ్చరణలతో సుమారు 65 మంది చిన్నారులకు విద్యారంభం చేయించారు.

ఈ సందర్భంగా నృత్య ప్రదర్శనలతో స్కూల్ విద్యార్థులు ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మోహన్ కృష్ణ గౌడ్, యజమాన్య ప్రతినిధులు, ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్, రవీందర్ రెడ్డి, శ్రీకాంత్ కులకర్ణి, ఎండీ యూనుస్, శోభారాణి, రవికుమార్, శ్రీనివాస్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

శ్రీ సాయి మేధలో వైభవంగా అక్షరభ్యాసం..!