బావిలో స్నానానికి వెళ్లి..!
– మునిగిన మృతి చెందిన వ్యక్తి
– పెద్దేముల్ మండల కేంద్రంలో విషాధం
తాండూరు, దర్శిని ప్రతినిధి: బావిలో స్నానం చేసేందుకని వెళ్లిన ఓ వ్యక్తి మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బోయిని శ్రీనివాస్ తన పొలం వద్ద పీర్ల ఏర్పాటు చేస్తున్నారు.

ఈ ఉత్సవాల కోసం అతని బందువు అయిన ధారూర్‌కు చెందిన తిరుపతి శ్రీనివాస్(36) వచ్చాడు. శుక్రవారం బోయిని శ్రీనివాస్ పొలం వద్ద ఉన్న బావిలో తిరుపతి శ్రీనివాస్ స్నానం చేసేందుకు వెళ్లాడు. ప్రమాద వశాత్తు బావిలో మునిగి మృతి చెందాడు. గమనించిన స్థానికులు పెద్దేముల్ పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న పెద్దేముల్ ఎస్ఐ అన్వేష్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం స్థానికులు మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీశారు. పంచనామ తరువాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరపుతున్నట్లు ఎస్ఐ అన్వేష్ రెడ్డి తెలిపారు.

