ఉపాధ్యాయులు.. త్రిమూర్తులే..!
– అభివర్ణించిన చిట్టిగణాపూర్ గ్రామస్తులు
– బదిలీ ఉపాధ్యాయులకు వీడ్కోలు సన్మానం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : విద్యతో పాటు పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన ముగ్గురు ఉపాధ్యాయులను త్రిమూర్తులని తాండూరు మండలం చిట్టిగణాపూర్ గ్రామస్తులు అభివర్ణించారు. గ్రామంలో దాదాపు 14 ఏండ్లుగా పాఠశాలలో ఉత్తమ సేవలు అందించిన హెచ్ఎం కిష్టప్ప, ఉపాధ్యాయులు బాలరాజ్, భాను ప్రసాద్ ఇటీవలే బదిలీపై వెళ్లారు. బదిలీపై వెళ్లిన ఈ ముగ్గురు ఉపాధ్యాయులకు శుక్రవారం గ్రామస్తుల సమక్షంలో వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మంజుల రాణి, గ్రామపెద్దలు వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన బోధన అందించారని గుర్తుచేశారు. పాఠశాల అభివృద్ధి కోసం సేవలను అందించారని అన్నారు. పాఠశాల కోసం, విద్యార్థుల కోసం త్రిమూర్తుల్లా కృషి చేశారని అభివర్ణించారు. కార్యక్రమంలో గ్రామస్తులు ప్రభాకర్ రెడ్డి, వెంకట్ రాములు, రవి పటేల్, శివప్ప పటేల్, చంద్రశేఖర్ రెడ్డి, సెక్రటరీ నవిత, బసిరెడ్డి, ప్రధానోపాధ్యాయులు నర్సిరెడ్డి. ప్రమోదుకుమార్, శశివర్ణ, నర్సింలు, బాలరాజ్, భాను కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

