రైల్వేలో కొత్త సూపర్ యాప్..!
– ఈ యాప్‌లోనే అన్నీ సేవలు
– టిక్కెట్ బుకింగ్ నుంచి భోజనం ఆర్డర్ వరకు
– ఎలా పనిచేస్తుందంటే…?
దర్శిని డెస్క్ : దేశంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థపై కోట్ల మంది ఆధారపడి ప్రయాణాలు సాగిస్తుంటారు. మారుతున్న కాలనికి అనుగుణంగా ప్రయాణికుల కోసం ఎన్నో ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసువస్తోంది. టిక్కెట్ బుక్కింగ్ కోసం ఒక యాప్, భోజనం ఆర్డర్‌కు ఒక యాప్, పీఎన్‌ఆర్ స్టేటస్ చెకింగ్‌కు ఒక యాప్ ఇలా పలు యాప్‌లను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇప్పుడు రైల్వే శాఖ ఓ కొత్త సూపర్ యాప్‌ను ప్రవేశ పెడుతుంది. అదే స్వారైల్ యాప్. ఇది రైల్వే ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవడం నుండి ఆహారం ఆర్డర్ చేయడం వరకు ప్రయాణీకులు ఇందులో చేసుకోవచ్చు. ఈ ఒక్క యాప్ ఉంటే రైలు టికెట్ బుకింగ్ అంటే రిజర్వేషన్, అన్ రిజర్వ్డ్ టికెట్ బుకింగ్, పార్శిల్ సర్వీస్ సమాచారం, ప్లాట్‌ఫామ్ టిక్కెట్లు, రైలు నడుస్తున్న స్థితి, రైలు షెడ్యూల్, PNR స్థితి, రైలులో ఆహార ఆర్డర్, ఫిర్యాదు వంటి అన్ని సేవలను అందులోనే పొందవచ్చు.
స్వారైల్ యాప్‌ను ఎలా ఉపయోగించాలి
ఈ యాప్ ప్రస్తుతం బీటా పరీక్ష దశలో ఉంది. త్వరలో ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. మీరు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరు కొత్త యూజర్‌గా సైన్ ఇన్ చేయవచ్చు లేదా మీ ప్రస్తుత రైల్ కనెక్ట్ లేదా UTS మొబైల్ ID వివరాలను నమోదు చేయవచ్చు. ప్రస్తుతం ఈ యాప్ స్థిరమైన వెర్షన్ ఎప్పుడు ప్రారంభించబడుతుందనే దాని గురించి అధికారిక సమాచారం లేదు. ఈ సూపర్ యాప్‌ను తీసుకురావడం వెనుక ప్రభుత్వానికి ఒకే ఒక ఉద్దేశ్యం ఉంది. వినియోగదారులు ఈ సేవల కోసం ఒక యాప్ నుండి మరొక యాప్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒకే యాప్‌లో అన్ని సేవలు పొందవచ్చు.
ఇదికూడా చదవండి…

