వామ్మో.. ఎలుగుబంట్లు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

వామ్మో.. ఎలుగుబంట్లు..!
– రాకతో ఉలిక్కిపడిన బెల్కటూర్
– ఎదురించిన వీధి కుక్కపై దాడి
– తీవ్ర భయాందోళనలో గ్రామస్తులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం బెల్కటూర్ గ్రామంలో ఎలుగు బంట్ల సంచారం కలకలం రేపింది. గ్రామంలోకి రెండు ఎలుగు బంట్లు వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.

గ్రామంలోని బాల్ రాం నాపరాతి పాలిషింగ్ యూనిట్లో ఉదయం రెండు ఎలుగు బంట్లు వచ్చినట్లు గ్రామస్తులకు ఆనవాళ్లు కనిపించాయి. వాటిని గమనించిన వీధి కుక్కలు వాటిపై దాడిచేసేందుకు యత్నించాయి. ఈ క్రమంలో కుక్కలు పెద్ద పెద్దగా అరుపులు చేయడంతో విన్న గ్రామస్తులు, సమీపంలో పనిచేస్తున్న కార్మికులు అక్కడికి వచ్చేలోపే రెండు ఎలుగు బంట్లు పారిపోయినట్లు తెలిపారు. అయితే ఎలుగు బంట్లు, కుక్కల దాడులలో ఓ కుక్కకు తీవ్రగాయాలయ్యాయి.

కుక్క మూతి భాగాన్ని పూర్తిగా కొరికేశాయి. దీంతో ఆ కుక్కకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటనతో బెల్కటూర్ గ్రామం ఉలిక్కి పడింది. అడవిలో ఉండాల్సిన జంతులు గ్రామాల్లోకి రావడం పట్ల తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది. గ్రామాల శివారులలో అడవి జంతువులు సంచారిస్తున్న సంఘటనపై దర్యాప్తు చేపట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

ఇదికూడా చదవండి…

తాండూరు కాలేజీకి కొత్త అధ్యాపకులు