అసెంబ్లీ టిక్కెట్లు బీసీలకు ఇవ్వాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

అసెంబ్లీ టిక్కెట్లు బీసీలకు ఇవ్వాలి
– స్వార్థం కోసమే నేతల పార్టీ పిరాయింపులు
– బీసీలపై చిన్నచూపు చూస్తే సహించేది లేదు
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కె.రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టిక్కెట్లు బీసీలకే కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం తాండూరు పట్టణంలోని హిమాలయ హోటల్లో రాజ్ కుమార్ మీడియాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 65 శాతం బీసీలు ఉంటే కేవలం 5 శాతం, 1 శాతం ఉన్న ఇతర సామాజిక వర్గాల్లో రాజకీయాల్లో రాణిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ బీసీల పట్ల చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. బీసీలో 137 కులాలు ఉంటే 40 చేతి వృత్తుల కులాలకే బీసీ బందును అమలు చె కారని, తాజాగా మైనార్టీలకు రూ. 1లక్ష సాయాన్ని ప్రకటించి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

అదేవిధంగా బీసీలను ఓటు బ్యాంకుగా భావించి రాష్ట్రంలోని బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 60 సీట్లు బీసీలకే కేటాయించాలన్నారు. వికారాబాద్ జిల్లాలోని తాండూరు, పరిగి స్థానాలకు ఖచ్చితంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీలకే అవకాశం కల్పించాలన్నారు. తాండూరు ప్రాంతానికి నిస్వార్థంగా పనిచేసిన మహరాజుల కుటుంబానికి తాండూరు అసెంబ్లీ టిక్కెట్టు ఇవ్వాలని, బీఆర్ఎస్ నుంచి బీసీ సామాజిక నేతలకు టిక్కెట్టు ఇవ్వాలన్నారు. అంతేకాకుండా ఎన్నికలకు ముందు కొందరు నాయకులు తమ టిక్కెట్టు కోసం పార్టీలు పిరాయింపులకు పాల్పడుతున్నారని అన్నారు. అలాంటి వారిని ప్రోత్సహించడం అప్రజాస్వామికమన్నారు. ఎన్నికల్లో బీసీల మద్య పార్టీలు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాయని అలాంటి వాటిని తిప్పికొడతామన్నారు. ఈ కార్యక్రమంలో బీపీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, మహిళ సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షురాలు, పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, మాజీ కౌన్సిలర్, లక్ష్మణ్, వడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు వడ్డె శ్రీనివాస్, గౌడ సంఘం నాయకులు బాబా గౌడ్, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు పరమేష్, వీరశైవ సమాజం ప్రధాన కార్యదర్శి లింగదలి రవికుమార్, బీసం సంఘం జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, మహిళ నాయకులు అనిత, జ్యోతి, విజయలక్ష్మీ, మండలాల అధ్యక్షులు రాధాకృష్ణ, నరేందర్, లక్ష్మణచారి, జుంటుపల్లి వెంకట్, రాము ముదిరాజ్, మీడియా ఇంజార్జ్ బసు, మతీస్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage