ఉచితంగా టైలరింగ్, మెహెందీ డిజైన్లలో శిక్షణ
– ఈనెల 15 నుంచి తరగతులు ప్రారంభం
– తాండూరు ముస్లిం వెల్పేర్ స్కిల్ డెవలప్మెంట్ సోసైటీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రాంతంలోని అమ్మాయిలకు, మహిళలకు ఉచితంగా టైలరింగ్, మెహెందీ డిజైన్ కోర్సులలో ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. మంగళవారం అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అతహర్, ప్రధాన కార్యదర్శి ఎండీ యూనుస్, ఖాలీద్ సైఫుల్లా, ఉపాధ్యక్షులు మహమ్మద్ బాసిత్ అలీ, అబ్దుల్ సలీం, అబ్దుల్ ఖవి తదితరులు మాట్లాడుతూ ముస్లిం వెల్పేర్ స్కిల్ డెవలప్మెంట్ సోసైటీ ఆధ్వర్యంలో తాండూరు ప్రాంతంలోని మహిళలు, అమ్మాయిలకు స్వయం ఉపాధి కల్పించేందుకు గతంలో టైలరింగ్, మెహింది డిజైన్ కోర్సులలో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.

ఈ యేడాది కూడా ఈనెల 15వ తేది నుంచి తాండూరు పట్టణం ముర్షద్ దర్గా సమీపంలోని కార్యాలయంలో అన్ని వర్గాల అమ్మాయిలు, మహిళలకు టైలరింగ్, మెహెందీ డిజైన్లలో తరగతులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. మెహెందీ డిజైన్ కు 45 రోజుల కోర్సు, టైలరింగ్ కు 5నెలల కోర్సు ఉంటుందని చెప్పారు. అసక్తిగల వారు రూ.500లు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లతో పాటు ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అబ్దుల్ హమీద్, ఖలీల్లుల్లా షరీఫ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అబ్దుల్ ఖయ్యూం, ఎండి జిలాని, కోశాధికారి ఎండి సిరాజ్, సభ్యులు అబ్దుల్ ఖయ్యూం పాష, ఎండి మస్తాక్, ఎంఏ వసీం, సయ్యద్ అర్షద్, అబ్దుల్ లతీఫ్, ఎంఏ అజహర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి….

