కాంగ్రెస్ నేత ఇంట్లో విషాదం
– డీసీసీబీ జిల్లా రవీందర్ గౌడ్ వదిన కన్నుమూత
– సంగెంకలాన్ మాజీ సర్పంచుకు మాతృవియోగం
– నారాయణ గౌడ్ సతీమణి బకులావతి మృతి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలంకు చెందిన కాంగ్రెస్ నేత ఇంట్లో విషాధం నెలకొంది. డీసీసీబీ ఉమ్మడి జిల్లా | వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ వదిన, ఎల్మకన్నె పీఏసీఎస్ మాజీ చైర్మన్ నారాయణ గౌడ్, సంగెంకలాన్ మాజీ సర్పంచ్, తాండూరు కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షులు మేఘనాథ్ గౌడ్ తల్లి బకులావతి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా బకులావతి అనారోగ్యానికి గురయ్యారు.

ఆదివారం ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో రాత్రి పట్టణంలోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమెకు మెరుగైన వైద్యం అవసరమని వైద్యులు సూచించడంతో వెంటనే కుటుంభీకులు హైదరాబాద్ కు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమె కన్నుమూతతో రవీందర్ గౌడ్ కుటుంబంలో విషాధం ఏర్పడింది. బకులావతి భౌతిక ఖాయాన్ని తాండూరు పట్టణం భవాని నగర్ లోని నివాసానికి తీసుకవచ్చారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంభీకులు తెలిపారు.
ఇది కూడా చదవండి….

