ఉత్తమ ఫలితాలే లక్ష్యం..!
– విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచేందుకు దృష్టి
– పదిలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రణాళికలు
– జిల్లా విద్యాధికారి రేణుకా దేవి
– తాండూరులో ఎఫ్ఎల్ఎన్ శిక్షణ పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కార్యాచరణ జరుగుతుందని వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుకాదేవి తెలిపారు. గురువారం తాండూరు పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎఫ్ఎల్ఎన్ శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రస్తుత విద్యా సంవత్సరంతో పాటు వచ్చే విద్యా సంవత్సరంలో వి ద్యా ప్రమాణాలు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 1-5వ తరగతులు. 6-9వ తరగతుల విద్యార్థుల్లో పఠనా సామర్థ్యాలను పెంచేందుకు దృష్టి సారించడం జరగుగుతుందన్నారు.
ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఎఫ్ఎల్ఎన్ పై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వచ్చే నెల డిసెంబర్ నాటికి సిలబస్ పూర్తి చేసేలా అదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆ తరువాత రివిజన్ చేపట్టడం జరుగుతుందన్నారు. ఇప్పటికే స్పెషల్ క్లాసులపై ఫోకస్ పెట్టడం జరిగిందన్నారు. రెండేళ్ల క్రితం కంటే గత యేడాది పదో తరగతి ఫలితాలలో మెరుగైన పథకాలు సాధించడం జరిగిందని గుర్తుచేశారు.
ఈ యేడాది కూడా పది ఫలితాలలో జిల్లా ర్యాంకును పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాలతో ఉపాధ్యాయుల బదిలీలు, కొత్త నియామకాలు, పదోన్నతులు కల్పించడం జరిగిందన్నారు. మరోవైపు జిల్లాలో అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం బిల్లులు చెల్లించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విధ్యాధికారి వెంకటయ్య, వివిధ పాఠశాలల హెచ్ఎం, టీచర్లు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

