పేదింటి పెళ్లికి ఐవీఎఫ్.. చేయూత..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పేదింటి పెళ్లికి ఐవీఎఫ్.. చేయూత..!
– పెండ్లి కూతురుకు పుస్తె మెట్టెలు, ఆర్థిక సాయం
– అందజేసిన జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ఓ నిరుపేద కుటుంబానికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్) బంగారం లాంటి చేయూతను అందించింది. వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ చేతుల మీదుగా వారింట్లో జరిగే పెళ్లి శుభకార్యానికి కావాల్సిన పుస్తె, మెట్టెలతో పాటు చీర, ఆర్థిక సాయం కూడా అందజేశారు.

తాండూరు పట్టణం మల్ రెడ్డిపల్లికి చెందిన కర్నె మమత ఇంట్లో ఆమె పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు. పేదరికంలో ఉండడంతో పెళ్లికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. వార్డు మున్సిపల్ మాజీ కౌన్సిలర్, ఐవీఎఫ్ జిల్లా మహిళ అధ్యక్షురాలు సాహు శ్రీలత లక్ష్మీకాంత్ ద్వారా విషయం తెలుసుకున్న జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ ఆదివారం కుటుంబ సభ్యులకు ఐవీఎఫ్ తరుపున పుస్తె మెట్టెలు, చీరతో పాటు పెళ్లికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త 53వ జన్మదినం సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదినాన్ని పురస్కరించుకుని పేదింటి పెళ్లి శుభకార్యానికి పుస్తె, మెట్టెలతో పాటు చీర, ఆర్థిక చేయూతను అందించడం జరిగిందని తెలిపారు. రానున్న రోజులలో ఐవీఎఫ్ ద్వారా నిరుపేదలకు, మహిళలకు సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు కుట్టు మిషన్లను పంపిణి చేసేందుకు కృషి చేస్తామన్నారు. మరోవైపు పేదింటి పెళ్లికి  సాయం అందించడం పట్ల సాహు శ్రీలత కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ కోశాధికారి ఆగీరు మహేష్, మహిళ కార్యదర్శి నేమలీగ స్వామి, పట్టణ అధ్యక్షులు కల్వ జగదీష్, కార్యదర్శి గుడిపల్లి ప్రణయ్, కోశాధికారి కల్వ సాయితేజ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

డబ్బుల్లేకున్నా రైల్లో వెళ్లొచ్చు..!