సలాం వలేకుం భయ్యా..!
– కారుకు జరూర్ ఓటు దేనా
– ప్రచారంలో ఆకట్టుకున్న ఎమ్మెల్యే సతీమణి ఆర్తి రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : సలాం వలేకుం భయ్యా.. కారుకు జరూర్ ఓటు దేనా అంటూ తాండూరు ఎమ్మెల్యే సతీమణి ఆర్తి రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఆకట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఎమ్మెల్యే సతీమణి ఆర్తిరెడ్డి ప్రచారం చేశారు.

ఎన్నికల కోడ్ లో చివరి శుక్రవారంను పురస్కరించుకుని ముస్లిం నేతలతో కలిసి పట్టణంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో ప్రచారం చేశారు. మైనార్టీ నాయకురాలుగా మారి మైనార్టీ నాయకులను, యువకులను సలాం వలేకుం అంటూ పలకరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు జరూర్ ఓటు దేవా అంటూ అభ్యర్థిస్తూ ఆకట్టుకున్నారు.
అనంతరం ఆమె మాట్లాడూత మైనార్టీల సంక్షేమానికి బీఆర్ఎస్ పార్టీ ఎంతో కృషి చేసిందన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా తాండూరులో మైనార్టీల సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేశారని అన్నారు. ఎన్నికల్లో పైలెట్ రోహిత్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళ కన్వినర్ శకుంతల, యువనాయకులు ఇంతియాజ్, మైనార్టీ నాయకులు. యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

