నేరేడుతో ఆరోగ్యం మెండు..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

నేరేడుతో ఆరోగ్యం మెండు..!
– ఆకుల‌తో కూడా ఆరోగ్య ప్రయోజనాలు
– క్యాన్సర్‌ కణాలను అడ్డుకునే శక్తి
– షుగర్‌ లెవల్స్‌ తగ్గించడంలో మేటి
దర్శిని డెస్క్ : నేరేడులో పోషకాలతోపాటు ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ఆయుర్వేద వైద్యంలో నేరేడును అమర సంజీవినిగా పేర్కొంటారు. ఈ పండులో ఏ, సీ విటమిన్‌తో పాటు ఆగ్జాలిక్‌ ఆమ్లం ఉండడంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. నేరేడు తింటే శరీరంలో ఉండే విష పదార్థాలను హరించి వేస్తుంది. నేరేడు పండ్లు మాత్ర‌మే కాదు.. ఈ చెట్టు ఆకులు కూడా ఎన్నోరకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. మరి నేరేడుపండ్లు తినడం వల్ల కలిగే ఆ బెనిఫిట్స్​ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!

నేరేడు ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియ‌ల్‌, యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. ఇవి నోరును ఆరోగ్యంగా ఉంచుతాయి. నేరేడు ఆకుల‌ను నేరుగా న‌మిలి తింటుండాలి. దీంతో నోట్లో ఉండే బ్యాక్టీరియా న‌శిస్తుంది. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. నేరేడు ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఆక్సీక‌ర‌ణ ఒత్తిడి త‌గ్గుతుంది. క్యాన్స‌ర్ క‌ణాలు పెర‌గ‌కుండా అడ్డుకుంటాయి. మధుమేహం బాధితులకు నేరేడు ఆకులు వ‌రంగా చెబుతున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. నేరేడు ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు ర‌క్తంలో చ‌క్కెర నెమ్మ‌దిగా విడుద‌ల అయ్యేలా చేస్తాయి. దీంతో క్రమంగా షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

నేరేడు ఆకుల్లో ఉండే స‌మ్మేళ‌నాలు జీర్ణ వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. తరచూ విరేచనాల సమస్యతో బాధపడేవారు నేరేడు ఆకుల కషాయాన్ని తాగితే ఉపశమనం పొందుతారు. కాలేయం పనితనం మెరుగుపడడానికి కూడా నేరేడు ఆకుల కషాయం ఎంతో మేలు చేస్తుంది. క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్‌, అజీర్తి, అసిడిటీ వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నేరేడు ఆకుల నుంచి ర‌సం తీసి పావు టీస్పూన్ చొప్పున భోజ‌నానికి ముందు తీసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. లేదంటే, ఈ ఆకుల‌ను నీటిలో వేసి మ‌రిగించి ఆ నీళ్ల‌ను రోజుకు 2 సార్లు భోజ‌నానికి అరగంట ముందు ఒక క‌ప్పు మోతాదులో తీసుకుంటూ ఉంటే.. మీ బ్లడ్‌ షుగర్‌ అదుపులో ఉంటుంది. టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారికి నేరేడు ఆకులతో ఎంతో మేలు జ‌రుగుతుందని అంటున్నారు. జ్వరం నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఈ ఆకులు సహాయపడతాయి. నేరేడు ఆకుల రసంలో ధనియాలు వేసి తీసుకున్నట్లయితే జ్వరం తగ్గిపోతుంది. అధిక బరువుతో బాధపడేవారికి కూడా నేరేడు ఆకులు ఉపయోగపడతాయి.

ఇదికూడా చదవండి…

బెల్లం, శనగలతో మస్త్ బెనిఫిట్స్‌..!