ప్రభుత్వ కాలేజీ రికార్డు..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రభుత్వ కాలేజీ రికార్డు..!
– రిజల్ట్స్, అడ్మిషన్లలో అత్యున్నత స్థానం
– ప్రశంసించిన ప్రిన్సిపల్ సెక్రటరీ యోగిత
– జిల్లా నోడల్ ఆఫీసర్ శంకర్ నాయక్‌కు సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ రికార్డు సాధించింది. ప్రభుత్వ కాలేజీలో ఉత్తీర్ణత శాతం, అడ్మిషన్లలో తాండూరు కాలేజీ అత్యున్నత స్థానంలో నిలిచింది.

గురువారం హైదరాబాద్ లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్ లతో సంబంధిత శాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రానా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సుమారు 400 కాలేజీల ప్రిన్సిపల్ లు రాగా వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఉత్తమ ప్రతిభను ప్రదర్శించింది. తాండూరులోని కాలేజీలో అన్ని కాలేజీల కంటే 550 అడ్మిషన్లు సాధించడంతో పాటు ఇంటర్ పరీక్షా ఫలితాల్లో 83 శాతం ఉత్తర్ణతను సాధించింది.

ఇందుకు గాను తాండూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ అత్యున్నత స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రానా జిల్లా నోడల్ ఆఫీసర్ శంకర్ నాయక్ ను అభినందించి.. సన్మానించారు. మరోవైపు తాండూరులోని కాలేజీ రాష్ట్ర స్థాయిలోనే రికార్డు సాధించడం పట్ల స్థానిక ఇంచార్జ్ ప్రిన్సిపల్ మల్లినాథప్ప, అధ్యాపకులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి…

వైద్య విద్యపై ప్రత్యేక దృష్టి..!