తాండూరులో షార్ట్ ఫిలిం సందడి…!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్ సినిమా

తాండూరులో షార్ట్ ఫిలిం సందడి…!
– షూటింగ్‌ను ప్రారంభించిన డీఎస్పీ బాలకృష్ణారెడ్డి
– చిత్రీకరణకు తోడ్పాటు : ఏఎంసీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో షార్ట్ ఫిలిం షూటింగ్ సందడిగా ప్రారంభమయ్యింది. తాండూరుకు చెందిన డాన్స్ మాస్టర్ అశోక్ దర్శకత్వ పర్యవేక్షణలో శ్రీ దత్త సాయి ప్రొడక్షన్ ఆధ్వర్యంలో రూపొందుతున్న ‘ ఇన్స్టా’ అనే షార్ట్ ఫిలిం షూటింగ్‌ శుక్రవారం పట్టణంలోని ఆదర్శనగర్ పాతకుంట కట్ట మైసమ్మ ఆలయంలో స్టార్ట్ చేశారు.

ఈ కార్యక్రమానికి తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, వినాయక గ్రూప్ ఆఫ్ చైర్మన్,తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్‌ నాయక్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి క్లాప్‌ కోట్టగా విఠల్ నాయక్ కెమెరా స్విచ్ ఆన్ చేసి షూటింగ్ ను ప్రారంభించారు. అనంతరం డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ షార్ట్ ఫిలింల ద్వారా సమాజంలో సామాజిక సృహ పెంచేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. డైరెక్టర్ అశోక్ సమాజం మార్పు కోసం ఈ షార్ట్ ఫిలిం తీయడం హర్షినియమన్నారు. షార్ట్ ఫిలింలో నటిస్తున్న వారిని యూనిట్ సభ్యులను అభినందించారు.

వినాయక గ్రూప్ చైర్మన్ విట్టల్ నాయక మాట్లాడుతూ డాన్స్ మాస్టర్ అశోక్ పర్యవేక్షణలో రూపొందుతున్న ఇన్స్టా పేరుతో రూపొందుతున్న షార్ట్ ఫిలిం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. షార్ట్ ఫిలిం చిత్రీకరణ కోసం తన వంతు సహాయం తోడ్పాటు అందిస్తానని అన్నారు. యూనిట్ సభ్యులు మరిన్ని మంచి అవకాశాలతో రాణించాలని ఆకాంక్షించారు. డాన్స్ మాస్టర్ అశోక్ మాట్లాడుతూ ప్రస్తుతం యువత సోషల్ మీడియాలో చేస్తున్న అఘాయిత్యాలు అమానవీయ సంఘటనలకు వాటి మార్పు కోసమే ‘ఇన్స్టా’ షార్ట్ ఫిలింను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి జగదీష్‌ కథ, స్క్రీన్ ప్లే అందించడంతో దర్శకత్వం వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెమెరా మెన్ దివ్యసంజయ్, వెంకటేశం, రచయిత అనిల్, భరత్, నటీనటులు బాలయ్య జిటిఎల్, వెన్నెల, వైష్ణవి, సరిత పవార్, విక్రమ్, సునీత, సుదిత, జీ తెలుగు హైమావతి, సాయి స్పందన, సహకారం విఠల్, కృష్ణయ్య, అంజిలప్ప, ఆలయ ప్రధాన కార్యదర్శి కే వేణుగోపాల్, కోశాధికారి అంజిలయ్య, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పాపయ్య,సుధాకర్, రాములు, నాగప్ప, ప్రకాశ్,ఆలయ అర్చకులు చందు స్వామి, తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఓటరు నమోదులో కొత్త రూల్..!