ఓటరు నమోదులో కొత్త రూల్..!
– నకిలీ ఓటర్లను తొలగించేందుకు దృష్టి
– ఎప్పుడు అమలు చేస్తారంటే…?
దర్శిని డెస్క్ : దేశంలో కొత్త ఓటర్ల నమోదుపై కేంద్రం ఓ కొత్త రూల్ తీసుకవస్తుంది. ఈ నిబంధనతో నకిలీ ఓటర్లు, అక్రమంగా నమోదును తొలగించేందుకు అవకాశం ఉంటుందని చెబుతోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో, ఓటుగా నమోదు కావాలంటే పుట్టిన తేదీ, జన్మించిన ప్రదేశాన్ని రుజువు చేసే ధ్రువపత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఈ చర్యలు భారత పౌరసత్వ చట్టం, 1955లో పేర్కొన్న నిబంధనల ఆధారంగా తీసుకున్నవిగా ఈసీ స్పష్టం చేసింది. ఈసీ తెలిపిన ప్రకారం, గతంలో ఇంటెన్సివ్ రివిజన్ చివరిసారిగా 2003లో జరిగింది. అయితే, అప్పటి నుంచి దేశంలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త ఓటర్లు వచ్చారు, చాలా మంది వలసబాటపట్టారు. కొందరి మరణాలు అధికారికంగా నమోదు కాలేదు.

కొన్ని చోట్ల అక్రమ వలసదారులు ఓటర్ల జాబితాలో చేరినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి ఇంటెన్సివ్ రివిజన్ ప్రాధాన్యత పెరిగింది. ఇది కేవలం ఓటర్ల జాబితా పరిశుద్ధతకే కాకుండా, ప్రజాస్వామ్యంలో నమ్మకాన్ని పెంచే మార్గంగా కూడా కనిపిస్తోంది. ఈ ప్రక్రియను ముందుగా బీహార్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రారంభిస్తున్నట్టు ఈసీ తెలిపింది. త్వరలో దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేసింది.

ఇదికూడా చదవండి…

