ఇక మహిళల జీవితాలు మారోచ్చు..!
– స్పెషల్ లోన్ స్కీం తెచ్చిన కేంద్రం
– రూ. 5లక్షల దాకా రుణాలు, 3లక్షల వరకు సబ్సీడీ
– అర్హతలు, దరఖాస్తులు ఎలా చేసుకోవాలంటే..?
దర్శిని డెస్క్ : దేశంలోని నిరుపేదల మహిళల జీవీతాలను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల మహిళల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోంది. వివిధ స్కీంల ద్వారా చేయూతను అందిస్తోంది. తాజాగా రూ. 5లక్షల వరకు రుణాలు, రూ. 3లక్షల వరకు సబ్సీడీ అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే మహిళలకు వ్యక్తిగతంగా కాకుండా సంఘాలుగా ఏర్పడిన వారికే ఈ ఆర్థిక చేయూతను అందించేందుకు నిబంధనలు విధించింది. దీనికి అర్హతలు ఏంటి.. ఎక్కడా దరఖాస్తు చేసుకోవాలి.. అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) ఆధ్వర్యంలో Self Help Group – Bank Linkage Programme (SHG-BLP) పేరిట మహిళలకు ప్రత్యేక రుణ పథకం అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీం ద్వాకా రూ.50,000 నుండి మొదలుకుని, వేగంగా అభివృద్ధి చెందితే రూ.5 లక్షల వరకు పొందవచ్చు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం తరఫున గరిష్టంగా రూ.3 లక్షల వరకు సబ్సిడీ అందించే అవకాశం ఉంది. ఇక వడ్డీ విషయానికి వస్తే సాధారణంగా 3 శాతం వడ్డీ వసూలు చేయబడుతుంది (రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు). తిరిగి చెల్లింపు చేసుకునేందుకు 2 నుండి 5 సంవత్సరాల్లో తిరిగి చెల్లించవచ్చు.

నిబంధనలు ఇవీ..
ఈ పథకం ద్వారా బీపీఎల్ (BPL) కార్డుదారులైన మహిళలు, 10-20 మంది కలిసి ఒక స్వయం సహాయక బృందంగా (SHG) ఏర్పడితే, గరిష్టంగా రూ.5 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది. ఈ లోన్‌ను ఉపయోగించి చిరు వ్యాపారాలు, పశుపోషణ, టైలరింగ్, అగ్రో ప్రాసెసింగ్, క్రీడా కేంద్రాలు వంటి స్వయం ఉపాధి మార్గాలను అభివృద్ధి చేసుకోవచ్చు. రుణంతోపాటు మహిళలకు అవసరమైన శిక్షణా సదుపాయాలు కూడా అందిస్తారు. టైలరింగ్, అగ్రో ప్రాసెసింగ్, ప్యాకింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం ఉన్నవారు అయితే, ఇదొక గొప్ప అవకాశమే. మీరు తెలుసుకున్న ఇతర మహిళలతో కలిసి SHGగా నమోదు చేసుకుని, మొదట్లో రూ.50 వేల నుంచి రుణం తీసుకొని, నెమ్మదిగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం ఇలా..
దరఖాస్తు చేసుకోవాలనుకునే మహిళలు తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలి. ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, SHG బ్యాంక్ ఖాతా పాస్‌బుక్, సభ్యుల సంతకాలు, షరతులకు అంగీకార పత్రం కలిగి ఉండాలి. తమ జిల్లా నాబార్డ్ కార్యాలయంలో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి.

ఇదికూడా చదవండి…

