అంగరంగ వైభవంగా..’గోనమ్మ’ఉత్సవాలు

తాండూరు రాజకీయం వికారాబాద్

అంగరంగ వైభవంగా..’గోనమ్మ’ఉత్సవాలు
– ఇంటికో బోనం చొప్పున 500 బోనాలు

తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం దామర్ చెడ్ గ్రామంలో వెలిసిన గోనమ్మ అవ్వ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో వెలసిన అమ్మవారికి కుల మతాలకు అతీతంగా ఇంటికో బోనం చొప్పున జరుపుకోవడం ఇక్కడ విశేషం.బోనాల పండుగ సందర్భంగా భారీ ఎత్తున వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ తగు ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా మంగళవారం నాడు సుమారు 500 బోనాలతో మహిళలు అమ్మవారికి తమ మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా బోనమెత్తిన ప్రతి ఒక్కరూ తమ కుటుంబాన్ని, తమ గ్రామానికి చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు.ఈ వేడుకల్లో పాల్గొనేందుకు మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.