ఆరోగ్య సమేత.. కసివింద..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ వికారాబాద్ హైదరాబాద్

ఆరోగ్య సమేత.. కసివింద..!
– ఈ ఆకు కూరలో ఔషధాలు
– పోయిన నోటి రుచి పోతే తిరిగి తెచ్చే శక్తి
– మూత్ర సంబంధిత రోగాలు తగ్గుముఖం
దర్శిని డెస్క్ : ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ మొక్కలు ఎన్నో ఈ ప్రకృతిలో ఉన్నాయి. అందులో ఓ చెట్టే కసివింద చెట్టు. దీనిని పెద్ద చిన్నంగి, చిన్న చిన్నంగి అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు, ఆకులతో మనిషి ఆరోగ్యాన్ని కాపాడుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆకులతో కూర, పప్పు, పచ్చడి చేసుకుని తింటారు. దీని వల్ల క‌డుపులో పేరుకుపోయిన వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపిస్తుందని నమ్ముతారు.
kvcs

ఎన్నో ఔష‌ధ‌ గుణాల‌ను క‌లిగిన చెన్నంగి ఆకులతో పచ్చడి చేసుకుని తింటే..నోటికి రుచిస్తుంది. జ్వరంతో నోటి రుచి కోల్పోయిన వారికి ఈ చట్నీ తిరిగి రుచి తెలిసేలా చేస్తుంది. దీనిలోని గుణాలు వాతాన్ని, విషాన్ని హ‌రించే శ‌క్తి ఈ క‌సివింద చెట్టుకు ఉంది. గాయాల‌ను, వ్ర‌ణాల‌ను, చ‌ర్మ రోగాల‌ను న‌యం చేయ‌డంలో ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

శరీరానికి ఏదైనా గాయం అయినప్పుడు ఆగ‌కుండా రక్తం కారుతూ ఉంటే, ఈ చెట్టు ఆకులను దంచి క‌ట్టుగా క‌ట్ట‌డం వ‌ల్ల గాయాల నుండి ర‌క్తం కార‌డం త‌గ్గుతుంది. ఇలా క‌సివింద చెట్టుతో మ‌నం బోలెడు ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. క‌నుక ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా వ‌ద‌ల‌కుండా ఇంటికి తెచ్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చిన్న చెన్నంగిని ఉప‌యోగించి క‌డుపులో ఉండే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌వ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. క‌సివింద చెట్టు ర‌సం చేదుగా ఉండి వేడిని క‌లిగిస్తుంది. క‌సివింద చెట్టు ఆకుల‌ను వెన్న‌తో నూరి చ‌చ్చుబ‌డిన ప‌క్ష‌వాత భాగాల‌పైన ప్ర‌తిరోజూ మ‌ర్ద‌నా చేయ‌డం వ‌ల్ల అవి పూర్వ స్థితికి చేరుకుంటాయి. క‌సివింద ఆకుల‌ను, వేరు బెర‌డును ఎండ‌బెట్టి పొడిలా చేసుకుని తేనెను క‌లిపి లేప‌నంగా రాసుకోవ‌డం వ‌ల్ల అనేక ర‌కాల చ‌ర్మ వ్యాధులు, గాయాలు, వ్ర‌ణాలు త‌గ్గుతాయి.

ఈ మొక్క పువ్వుల‌ను దంచి వ‌స్త్రంలో వేసి ర‌సాన్ని తీయాలి. ఈ ర‌సాన్ని ఒక‌టి లేదా రెండు చుక్క‌ల ప‌రిమాణంలో కంటిలో వేసుకుంటూ ఉంటే ఏడు రోజుల‌ల్లో రేచీక‌టి త‌గ్గుతుంది. క‌సివింద గింజ‌ల‌ను దోర‌గా వేయించి పొడి చేసుకుని త‌గిన‌న్ని పాలు, కండ‌చ‌క్కెర క‌లిపి కాఫీ లా తాగుతూ మూత్ర సంబంధిత రోగాలు త‌గ్గుతాయి. ర‌క్తం కూడా శుద్ధి అవుతుంది.

ఇదికూడా చదవండి…

నల్ల మిరియాలా.. మజాకా..!