భద్రేశ్వర షాపింగ్ కాంప్లెక్స్ అభివృద్ధికి తోడ్పాటు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

భద్రేశ్వర షాపింగ్ కాంప్లెక్స్ అభివృద్ధికి తోడ్పాటు..!
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం భద్రేశ్వర దేవాలయ ఆవరణలో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి తోడ్పాటు అందిస్తామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు.
kvcs
శుక్రవారం దేవాలయ ఆవరణలో జరుగుతున్న నిర్మాణ పనులను దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ బాల్ రెడ్డి, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ లతో కలిసి పరిశీలించారు. షాపింగ్ కాంప్లెక్స్ లో దుకాణ దారుల యజమానులతో పనుల గురించి మాట్లాడారు. పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ ద్వారా కాంప్లెక్స్ నిర్మాణాల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయితే వ్యాపారులతో పాటు దేవాలయం అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేవాలయం ఆవరణలో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంకు తమ వంతు తోడ్పాటు అందిస్తామని అన్నారు. ఎమ్మెల్యే వెంట నాయకులు సత్యమూర్తి దొరశెట్టి, వీరశైవ, వీరశైవ యువదళ్ సభ్యులు, దుకాణాల వ్యాపారులు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టండి..!