సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టండి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టండి..!
– ఇందిరమ్మ, డబుల్ బెడ్ రూం అర్హులను గుర్తించండి
– ప్రతి రోజు ఓ గంట వార్డుల్లో పర్యటించాలి
– సమస్యల పరిష్కారానికి సమన్వయంగా పనిచేయాలి
– కాంట్రాక్టర్లతో మాట్లాడి పనుల్లో వేగం పెంచాలి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష
తాండూరు, దర్శిని ప్రతినిధి : సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్ యాదగిరి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డిలతో కలిసి అధికారులతో చర్చించారు.
kvcs
మున్సిపల్ లోని ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, ఆడ్మినిస్ట్రేటివ్, శానిటేషన్ విభాగాలతో పాటు వార్డు ఆఫీసర్లు, మాజీ కౌన్సిలర్లతో కలిసి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఒక్కో విభాగంలో ఏయే సమస్యలు ఉన్నాయి..? ఏయే పనులు పెండింగ్ లో ఉంచారు..? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..? అని అడిగితెలుసుకున్నారు. వార్డు ఆఫీసర్లు నిర్వహిస్తున్న విధులపై ఆరా తీశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లతో చర్చించి పెండింగ్ లో అభివృద్ధి పనులు పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీసీ రోడ్లు, మురుగు కాలువలు ఇతర పనులపై ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. ముఖ్యంగా ప్రజలకు తాగునీటి సరఫరా విషయంలో ఇబ్బందులు రావద్దని, ఏమైనా లీకేజీలు ఉంటే మరమ్మత్తులు చేయించాలన్నారు. అదేవిధంగా టౌన్ ప్లానింగ్. విభాగంలో డిప్యూటేషన్ పై వెళ్లిన అధికారులను తిరిగి రప్పించాలని కమీషనర్ ను ఆదేశించారు. పట్టణంలో అక్రమ నిర్మాణాలపై సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించి తక్షణ చర్యలు. తీసుకోవాలని సూచించారు. శానిటేషన్ విభాగంలో ప్రస్తుతం ఉన్న ట్రాక్టర్లు, ఆటోలు, ఇతర వాహనాలను వినియోగించుకోవాలని, మిగతా వాటిని మరమ్మత్తులు చేయించి వాడుకోవాలని అన్నారు. సీజనల్ వ్యాధుల దృష్ట్యా పట్టణంలో పారిశుద్ధ్యం తలెత్తకుండా చూడాలన్నారు. అదేవిధంగా పట్టణంలో విద్యుత్ దీపాల సమస్యలు రాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మున్సిపల్ లో విధుల్లోకి వచ్చిన వార్డు ఆఫీసర్లు ప్రతిరోజూ 1, 2 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం, ఉచిత విద్యుత్, సబ్సీడీ గ్యాస్ సిలిండర్ వంటి పథకాల అమలును పర్యవేక్షించాలన్నారు. ఈ పథకాలకు ఎవరైనా అర్హులు దూరమై ఉంటే గుర్తించి.. వారికి పథకాలు అమలయ్యే విధంగా చూడాలన్నారు. డబుల్ బెడ్‌రూం, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను గుర్తించాలని, ఇందిరమ్మ లబ్దిదారులు ఎవ్వరు మిస్‌ కావద్దని అన్నారు. ఆయా వార్డుల్లో ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాలను గుర్తించి సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు జవాబుదారిగా సమస్యలను పరిష్కరించాలన్నారు. పట్టణ అభివృద్ధిలో తమవంతు సహాకారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ సాజిద్ అలీ. మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, నాయకులు బోయరాజు, సత్యమూర్తి దొరశెట్టి, మహిళ నాయకురాలు శోభారాణి, డీఈ మణిపాల్, ఏఈ ఖాజా హుస్సేస్, మేనేజర్ నరేందర్ రెడ్డి, శానిటరీ ఇను స్పెక్టర్లు ఉమేష్, వెంకటయ్య, టౌన్ ప్లానింగ్, మెప్మా, వార్డు ఆఫీసర్లు, జవాన్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

మొగులప్ప కుటుంబానికి భరోసా..!