బీఆర్‌ఎస్‌కు ఎంపీటీసీ ఫోరం నేత గుడ్‌బై..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బీఆర్‌ఎస్‌కు ఎంపీటీసీ ఫోరం నేత గుడ్‌బై..!
– పార్టీని వీడిన గాజీపూర్ వెంకటేష్‌ చారి
– సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తంలో చేరిక
– అభినందించిన ఎంపీ రంజిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇతర పార్టీలకు నేతల వలసలు మళ్లీ జోరందుకున్నాయి. గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు చేరికలు జరిగితే తాజాగా పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో జరుగుతున్నాయి. వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్ మండలం గాజీపూర్‌ గ్రామానికి చెందిన ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేష్‌ చారి తాజాగా బీఆర్ఎస్‌ పార్టీకి గుడ్‌బై పలికారు. పార్టీని వీడిన వెంటనే గురువారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేశారు. ఒకవిధంగా వెంకటేష్‌ చారి కాంగ్రెస్‌ పార్టీలో చేరడం సొంతగూటికి చేరుకున్నట్లే.

తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థి నేతగా కొనసాగిన వెంకటేష్ చారి ఆ తరువాత కాంగ్రెస్ ఎన్ఎన్‌యూఐ నేతగా పనిచేశారు. ఆ తరువాత బీఆర్ఎస్‌ పార్టీలో చేరి గాజీపూర్ ఎంపీటీసీగా గెలుపొందారు. ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షు పదవిని పొందారు. ఆ తరువాత రాష్ట్ర ఎంపీటీసీ ఫోరం ఉపాధ్యక్షులుగా ఉన్నారు. చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అభిమానిగా, అనుచరుడుగా పనిచేస్తున్నారు.

ఎంపీ రంజిత్ రెడ్డి సమక్షంలోనే వెంకటేష్ చారి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీలో చేరిన వెంకటేష్‌ చారిని అభినందించారు. చేవెళ్ల ప్రాంతం అభివృద్ధే లక్ష్యంగా ఎంపీ రంజిత్ రెడ్డి తో కలిసి పనిచేసేందుకు పార్టీలో చేరినట్లు ఈ సందర్బంగా వెంకటేష్ చారి వెల్లడించారు.

ఇదికూడా చదవండి…

గడ్డివాము దగ్ధం