శ్రీ సాయి మేధ, ఆపిల్ కిడ్స్ లో వైభవంగా బతుకమ్మ వేడుకలు
– ప్రత్యేక పూజలు నిర్వహించిన కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి
– సంప్రదాయ దుస్తులతో ఆడి, పాడిన విద్యార్థులు, ఉపాధ్యాయులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా తాండూర్ పట్టణంలోని శ్రీ సాయి మేధ ఉద్యాలయం, ఆపిల్ కిడ్స్ పాఠశాలల్లో బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకొన్నారు. చిన్నారులు, ఉపాధ్యాయులు పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, పూజలు చేశారు. బతుకమ్మ ఆటపాటలతో గౌరమ్మను కొలిచారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే పూలను పూజించే గొప్ప సంస్కృతీ, సంప్రదాయాలు తెలంగాణ ప్రజల సొంతమని, బతుకమ్మ పండుక తెలంగాణ సంస్కృతికి ప్రతీకని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఆపిల్ కిడ్స్ లో బతుకమ్మ సంబరాలు


ఇదికూడా చదవండి…

