పెద్దేముల్ ఎస్ఐ వేణుపై వేటు

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

పెద్దేముల్ ఎస్ఐ వేణుపై వేటు
– కొత్త ఎస్ఐగా శంకర్ నియామకం
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : పెద్దేముల్ పోలీస్టేషన్ ఎస్ఐ వేణు కుమార్ పై వేటు పడింది. ఆయనను ఇక్కడి నుంచి వీఆర్ కు బదిలీ చేశారు.

ఈ మేరకు జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ప్రకటించారు. రెండు రోజుల క్రితం పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన ఫిరోజ్ ను స్టేషన్ పిలిపించి.. ఎస్ఐ వేణు, కానిస్టేబుళ్లు దాడి చేశారని వివాదం జరిగిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఎస్ఐ వేణు కుమార్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆయన స్థానంలో పెద్దేముల్ ఎస్ఐగా శంకర్ ను నియమించారు. ఎస్ఐ శంకర్ గతంలో తాండూరు పట్టణ ఎస్ఐగా, యాలాల ఎస్ఐగా, బషీరాబాద్ ఎస్ఐగా పనిచేశారు.

ఇదికూడా చదవండి…

గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల అదృశ్యం