వార్డు సభ్యుల అభ్యర్థులకు షాక్…!

తాండూరు రాజకీయం వికారాబాద్

వార్డు సభ్యుల అభ్యర్థులకు షాక్…!
– తాండూరు మండలంలో 5 నామినేషన్ల రిజక్ట్
– మహిళ స్థానానికి పురుషుడి నామినేషన్
– నామినేషన్ల తిరస్కరణకు కారణాలు ఇవే
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలంలోని పంచాయతీ ఎన్నికల్లో పోటీ పడేందుకు ఆశించిన వార్డు సభ్యుల అభ్యర్థులకు షాక్ తగిలింది. పోటీ చేసేందుకు వేసిన నామినేషన్ల పరిశీలనలో క్లస్టర్ అధికారులు పలువురు దాఖలులను తిరస్కరించారు.

ఓ గ్రామంలో మహిళ స్థానానికి పురుషుడు నామినేషన్ వేయడంతో తిర్కసరించారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 33 గ్రామ పంచాయతీలకు గాను 11 క్లస్టర్లను ఏర్పాటు చేసి సర్పంచులతో పాటు వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వకరించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఆయా క్లస్టర్లలో ఎన్నికల అధికారులు నామినేషన్ల పరిశీలన చేపట్టారు. మండలంలోని అల్లాపూర్, చెన్ గేష్ పూర్, నారాయణపూర్, కరణ్ కోట్ గ్రామాలలో 5 మంది వార్డు సభ్యుల నామినేషన్లను తిరస్కరించడం జరిగిందని వివరించారు.

అల్లాపూర్ లో 4వ వార్డుకు నామినేషన్ వేసిన మడపతి నాగేంద్రయ్య స్వామికి 5వ వార్డు వ్యక్తి ప్రతిపాదన లేనట్లు గుర్తించారు. 6వ వార్డులో అక్షిత్ వేసిన నామినేషన్ కు 21 ఏండ్ల వయస్సు ఉండాల్సి ఉండగా 20 ఏండ్లే ఉండడంతో రిజక్ట్ చేశారు. అదేవిధంగా చెన్ గెష్్పూర్లో 5వ వార్డుకు నామినేషన్ వేసిన కలాల్ మంజునాథ్ గౌడ్ వయస్సు 21 ఏండ్లకు గాను 20 ఏండ్లే ఉండడంతో తిరస్కరించారు. నారాయణపూర్లో 4వ వార్డులో మహిళ రిజర్వేషన్ ఉండగా రమేష్ నామినేషన్ వేయడంతో తిరస్కరణకు గురైంది. ఈ సంఘటన చర్చనీయాంశం అయ్యింది. మరోవైపు నామినేషన్ల ప్రక్రియలో భాగంగా సోమవారం అప్పీల్, మంగళవారం తిరస్కరణకు అవకాశం ఉంది.

ఇదికూడా చదవండి…

పంచాయతి ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం