పైలెట్ చేతికి బీ-ఫారం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పైలెట్ చేతికి బీ-ఫారం..!
– స్వయంగా అందించిన సీఎం కేసీఆర్
– తాండూరు గులాబీలో జోష్
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు గులాబీ పార్టీలో జోష్ ఫుల్ వాతావరణం నిండుకుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు బీ-ఫారాలను అందజేశారు. ఆదివారం రాత్రి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బీ- ఫారం అందజేశారు. స్వయంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బీ- ఫారం అందజేశారు. దీంతో తాండూరులోని పార్టీ శ్రేణుల్లో జోష్ ఏర్పడింది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బీ- ఫారం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు ఆదివారం బీఆర్ఎస్ పార్టీ చారిత్రత్మాక మేనిఫెస్టో ప్రకటించిన సంతోషంలో ఉన్న నేతలకు ఎమ్మెల్యేకు బీ- ఫారం అండీంచడంతో పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నిండింది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బీ- ఫారం ఆడుకోవడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు.