కోట్రిక కోడలు పొలిటికల్ ఎంట్రీ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కోట్రిక కోడలు పొలిటికల్ ఎంట్రీ..!
– 24వ వార్డు నుంచి పోటీ కన్ఫామ్
– ఇప్పటికే జనంలోకి వచ్చిన కోట్రిక నాగలక్ష్మీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య కోడలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్ సంఘ సేవతో పాటు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు.

పట్టణంలోని 24వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరుపున బరిలో దిగుతున్నారు. పార్టీ అధిష్టానం కోట్రిక నాగలక్ష్మీకి టిక్కెట్ కన్ ఫామ్ చేయడంతో కోట్రిక నాగలక్ష్మీ జనంలోకి వచ్చేశారు. అత్త కోట్రిక విజయలక్ష్మీ, స్వర్గీయ కోట్రిక వెంకటయ్య స్ఫూర్తితో రాజకీయాల్లోకి వస్తున్నారు.

మున్సిపల్ అభివృద్ధిలో కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య చెరగని ముద్ర వేశారు. అదే బాటలో కోట్రిక నాగలక్ష్మీ ముందుకు సాగుతున్నారు. ముందుగా వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలుగా సంఘ సేవలోకి అడుగు పెట్టారు. తాజాగా పోలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం పోటీ చేయబోతున్న 24వ వార్డులో కోట్రిక కుటుంబానికి మంచి పేరు ఉంది. దీంతో కోట్రిక నాగలక్ష్మీ ఇప్పటికే ప్రచారంను ప్రారంభించారు. వార్డులోని ప్రజలను కలుస్తూ ఎన్నికల్లో ఆదరించాలని కోరుతున్నారు.

ఇదికూడా చదవండి…

రౌడీ షీటర్లపై స్పెషల్ ఫోకస్..!